Walnuts: వాల్‌నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. కానీ వరుసగా 10 రోజుల పాటు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? గుండె ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ వరకు ఎలాంటి మేలు జరుగుతుందో? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
రోజూ కొన్ని వాల్‌నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. కానీ అసలు వాల్‌నట్స్‌లో అంత ప్రత్యేకత ఏముంది? వీటిని 10 రోజుల పాటు క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అయిన ALA, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 10 రోజుల పాటు వాల్ నట్స్ ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం.
26
గుండె ఆరోగ్యానికి మేలు
వాల్‌నట్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సమతుల్య ఆహారంలో వాల్‌నట్స్‌ను చేర్చుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో ఉప్పు లేదా చక్కెర కలపని వాల్‌నట్స్‌ను పరిమిత మోతాదులో చేర్చుకోవడం మంచిదంటున్నారు.
36
కడుపు నిండిన భావన
వాల్‌నట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తిన్న తర్వాత కొంతసేపు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో మధ్యలో పదేపదే స్నాక్స్ తినాలనే కోరిక తగ్గొచ్చు. అయితే వాల్‌నట్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తినకూడదు.
వాల్‌నట్స్‌లో ALA అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లం. శరీరం దీన్ని స్వయంగా తయారు చేసుకోలేదు కాబట్టి ఆహారం ద్వారా పొందాలి. వాల్‌నట్స్‌లో ALA మంచి మొత్తంలో ఉంటుంది. ఇది మెదడు పనితీరుకు సహాయపడుతుంది.
56
జీర్ణక్రియకు మేలు
వాల్‌నట్స్‌లో ఫైబర్ కూడా ఉంటుంది. రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి మంచిది. అయితే కేవలం వాల్‌నట్స్ తినడం వల్లే జీర్ణ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అనుకోవద్దు. పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, పప్పులు వంటి ఇతర ఫైబర్ ఆహారాలను కూడా తీసుకోవాలి. అలాగే తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు వీటిని అధికంగా తినకూడదు.
66
ఎంత పరిమాణంలో తీసుకోవచ్చు?
వాల్‌నట్స్‌ను ఉప్పు, చక్కెర లేదా ఇతర అదనపు పదార్థాలు లేకుండా సహజంగా తీసుకోవడం మంచి ఎంపిక. గుప్పెడు వాల్ నట్స్ ని రోజువారీ స్నాక్‌గా తీసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరి ఆహార అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. నట్స్ అలెర్జీ ఉన్నవారు వీటిని తీసుకోకూడదు. ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్య, ఆహార పరిమితి ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.