3.బరువు తగ్గించే క్వినోవా..
క్వినోవా తిన్నంత మాత్రాన మ్యాజిక్‌లా బరువు తగ్గిపోరు. కానీ, ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగించడం వల్ల రోజువారీ కేలరీల వినియోగం తగ్గుతుంది. ఇది క్రమంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.అలా అని దీనిని కూడా మరీ ఎక్కువగా తినకూడదు.
4. ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్ బూస్ట్!
క్వినోవాలోని అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే..దీని వల్ల మనకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌ను అందిస్తుంది. శాకాహారులకు వైట్ రైస్ కంటే ఇది ఒక అద్భుతమైన, పుష్కలమైన ప్రోటీన్ మూలం.
5. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో.. వైట్ రైస్ తిన్న వెంటనే రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కానీ క్వినోవాలో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల రక్తంలో గ్లూకోజ్ కలవడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించకపోయినా, షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
6. పోషకాల గని – మల్టీ విటమిన్ బూస్టర్.. వైట్ రైస్‌తో పోలిస్తే క్వినోవాలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్ , ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరానికి అవసరమైన మైక్రో-న్యూట్రియంట్స్‌ను అందిస్తుంది.