మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి అజీర్ణ సమస్య రాదు. ఏది తిన్న సులువుగా అరిగిపోతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించేలా సహాయపడుతుంది కూడా.
మెంతుల నీరు ఆకలి వేసే ఫీలింగును కూడా అడ్డుకుంటుంది. శరీరంలో జీవక్రియ రేటును పెంచుతుంది. శరీరంలోని రక్తానాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు.
మెంతుల నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. మెంతి నీరు తాగడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. తలపై చుండ్రు, దురద వంటి తల సమస్యలు ఉన్నవారికి వాటి నుంచి ఉపశమనం దక్కుతుంది.