ఎక్కువకాలం పాటూ ఆరోగ్యంగా జీవించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం వ్యాయామాలు చేయడం ఎక్కువగా చేస్తారు. వ్యాయామంతో మనం తినే ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రాత్రిపూట పార్టీల పేరుతో జంక్ ఫుడ్ అధికంగా తినడం, పొట్ట ఖాళీ లేకుండా తినడం వంటి పనులు చేస్తారు. అలా చేయడం నిద్ర బాగా పడుతుందని అనుకుంటారు. నిజానికి అలాంటి తింటి అలవాట్లు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
రాత్రి భోజనంలో పచ్చని కూరగాయలు ఉండేలా చూసుకోండి. పాలకూర, సొరకాయ, బెండకాయ, టొమాటో, బీన్స్, క్యాబేజీ వంటి వాటిని రాత్రి భోజనంలో చేర్చుకోండి. ఇవి పొట్టకు చాలా మంచివి. రాత్రిపూట సులభంగా జీర్ణం కూడా అవుతాయి. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు రాత్రిపూట తినడం ఏమాత్రం మంచిది కాదు.