Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం రెండూ ముఖ్యమే. అయితే రెండింటినీ కలిపి తాగితే ఏమవుతుంది? ఈ రెండింటినీ కలిపి తాగే కొత్త ట్రెండ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇలా తాగడం వల్ల లాభాలేంటి?
మండే ఎండల్లో మన శరీరాన్ని తేమవంతంగా ఉంచుకోవడానికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం రెండూ మేలు చేస్తయి. కానీ అందరూ ఈ రెండింటినీ విడివిడిగా తాగుతారు. ఈ రెండింటిలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ డ్రింక్స్ రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తాగే ట్రెండ్ ఇప్పుడు మొదలైంది. ఇలా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.
24
డీ హైడ్రేషన్ తగ్గుతుంది
కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగారంటే శరీరానికి డీహైడ్రేషన్ సమస్య రాదు. ఈ డ్రింకులో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం అధికంగా ఉంటాయి. శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి ఈ కాంబినేషన్లో డ్రింకు అద్భుతంగా పనిచేస్తుంది.
34
చర్మం మెరిసిపోతుంది
కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి పదిరోజులు తాగారంటే చర్మం మెరిసిపోతుంది. ఈ పానీయం శరీరం లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. ఇది మీ చర్మానికి ఎంతో ప్రయోజనం. నిమ్మకాయలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువ. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కొబ్బరి నీళ్లతో పాటూ నిమ్మరసం కలిపి తాగినప్పుడు, ఇది శరీర రోగనిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది.
కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపడం వల్ల బరువు వేగంగా తగ్గుతుంది. ఈ కాంబినేషన్లో డ్రింకును తాగితే శరీర జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం చేస్తుంది.