Hair Loss: జుట్టుకు ప్రతి రోజూ షాంపు పెట్టొచ్చా..? తలస్నానం ఎన్ని రోజులకోసారి చేయాలో తెలుసా..?

First Published Jan 12, 2022, 2:07 PM IST

Hair Loss: మనలో చాలా మంది రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు స్నానం చేసేవారు ఎక్కువగానే ఉంటారు. అందులో తలకు షాంపు పట్టించి మరీ నిత్యం స్నానం చేస్తుంటారు. దీని వల్ల  చాలానే న‌ష్టాలు ఉన్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిత్యం షాంపుల‌తో స్నాయం చేస్తే.. జుట్టుపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.  
 

ఆడవారికైనా.. మగవారికైనా జుట్టుంటేనే అందం. పట్టుకుచ్చుల్లా మెరిసిపోయే.. నిగనిగలాడే కురులతో చ్చే ఆ అందం ఎదుటి వారిని ఆకర్షించడమే కాకుండా మనల్ని ప్రత్యేక వ్యక్తులుగా నిలబెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా టీవీ యాడ్ లో చూపించే మాదిరిగా వెంట్రుకలు కోమలంగా సుకుమారంగా ఉండటానికి వాళ్లు చూపించే వివిధ రకాల షాంపులను, నూనెలను వాడుతుంటారు చాలా మంది. వీటిని యూజ్ చేయడం వల్ల జుట్టు కొంచెమైనా.. పెరిగిందా.. లేదా అన్న సంగతి పక్కన పెడితే.. ఉన్నది ఊడిపోకుండా ఉంటే చాలు అనుకునే వారే చాలా మంది ఉన్నారు. 
 

కాగా ప్రస్తుత కాలంలో ఒత్తైనా.. పొడుగైన జుట్టు ఉండటం గగణమైపోయింది. కొత్త జుట్టు రాకున్నా పర్లేదు.. ఉన్నది ఊడకుండా ఉంటే చాలా అనుకునే వారే ఎక్కువున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం.. ఇతర కారణాలతో జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది. కారణాలేవైనా జుట్టు రాలడం సమస్య తీవ్రమైన బాధను కల్గిస్తుంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చూడవచ్చు.. పదండి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
 

సాధారణంగా బాల్డ్ నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా వల్ల జుట్టు ఊడి బట్టతలకు దారితీస్తుందని సైంటిస్టులు తెలుపుతున్నారు. అయితే మగవారిలో.. అధికమైన ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం కారణంగా బట్టతల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మహిళల్లో గర్భధారణ, మోనోపాజ్.. ఇతర సమయాల్లో హర్లోన్లలో వచ్చే మార్పు వల్ల జుట్టు ఊడిపోతుంది. ఇవే కాకుండా ఆడ, మగ అంటూ తేడా లేకుండా.. షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్ వంటి జబ్బులకు వాడే మెడిసిన్ కారణంగా కూడా వెంట్రుకలు రాలుతాయి. 

జున్యుపరంగా వచ్చే బట్టతలను ఆపడం కష్టతరమైంది. కానీ కొన్ని రోజుల వరకు జుట్టును ఊడకుండా చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వెంట్రుకలు ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు , విటమిన్లు, ఫైబర్ లు పుష్కలంగా లభించే హెల్తీ ఫుడ్ ను మీ రోజూ వారి ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. 
 

ఖచ్చితంగా రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర ఉండేట్టు చూడాలి. రోజూ వ్యాయామం కూడా అవసరమే. మద్యపానానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం జోలికి అస్సలు పోకూడదు. ఇకపోతే బయటకు వెళ్లేటప్పుడు తలకు స్కార్ఫ్ ను కట్టుకోవడం మర్చిపోవద్దు.  ఇక తలపై డస్ట్ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు. 
 

హెడ్ క్లీన్ గా లేకపోతే చుండ్రు వచ్చే ప్రమాదం ఉంది.  సో మగవారు షాంపుతో రోజు విడిచి రోజు హెడ్ బాత్ చేయొచ్చు. కానీ ఆడవారు మాత్రం వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే షాంపుతో తలస్నానం చేయాలి. అందులోనూ ఎక్కువ రసాయనాలున్న షాంపూలను అస్సలు వాడకూడదు. ఇకపోతే జుట్టు జిడ్డుగా తయారవుతుందని చాలా మంది తలకు నూనె పెట్టడమే మర్చిపోయారు. కానీ నూనె పెట్టడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. 
 

తలకు నూనె పెట్ట‌డం వ‌ల్ల జుట్టుకు కావాల్సిన తేమ అందుతుంది. అందుకే తన తల స్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టి ఒక 15 నిమిషాల పాటు మసాజ్ చెయ్యాలి. దాంతో కుదుళ్లు బలంగా పఠిష్టంగా తయారవుతాయి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు హెయిర్ డ్రయ్యర్లు, కర్లర్లు వాడటం అంత మంచిది కాదు. వీటి వాడకం వల్ల జుట్టు చిట్లి పోయి.. రాలిపోయే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

click me!