నిద్రించడానికి ముందు ఆల్కహాల్ సేవించడం, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు (Bad habits) దూరంగా ఉండటం మంచిది. వీటి కారణంగా శరీరానికి మత్తు ఏర్పడి మరుసటి రోజు అలసటగా (Fatigue) ఉంటుంది. ఈ చెడు అలవాట్లు మీ భాగస్వామికి నచ్చకపోవడంతో మీ మధ్య ఏకాంతానికి అంతరాయం కలగవచ్చు.
అలాగే ఇంటిలో పెంపుడు జంతువులు (Pets) ఉంటే వాటిని దూరంగా వాటి స్థానంలో ఉంచడం మంచిది. ఇవి మీ ఏకాంతానికి అంతరాయం (Interruption) కలిగించవచ్చు. దంపతులు ఏకంగా గడపడానికి దొరికే సమయం నిద్రించే సమయం. పడకగది అంటే కేవలం పడుకోవడానికి మాత్రమే కాదు.
మీ మనసులోని భావాలను ఒకరికొకరు తెలియపరచుకుంటూ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను (Love) మరింత బలపరచుకోవడం. కనుక ఈ ఏకాంత సమయంలో ఇతర విషయాలను చర్చించకుండా సరదా కబుర్లు (Fun chatter) చెప్పుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఇలా చేస్తే ఒత్తిడి (Stress) తగ్గిపోయి ప్రశాంతంగా (Calm down) నిద్ర పోయే అవకాశం ఉంటుంది. పడకగది అంటే కేవలం శృంగారంలో పాల్గొనడమే కాదు. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకోవడం. వారి ఇష్టాలకు అనుగుణంగా ప్రవర్తించడం. అప్పుడే మీ మధ్య బంధం బలపడి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి.
నిద్రించే పడకగదిని శుభ్రంగా (Clean) ఉంచుకోవాలి. పడక గదిలోని వస్తువులను చిందరవందరగా (Cluttered) ఉంచరాదు. నిద్రించే మంచం పైన బెడ్ షీట్ ను నీట్ గా సర్ది పడకగదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి ఫ్రెష్ గా ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది.
శృంగారంలో పాల్గొనడానికి ముందు శరీరాన్ని సున్నితంగా మసాజ్ (Gentle massage) లు చేసుకోవడంతో శరీరానికి ప్రశాంతత కలుగుతుంది. తరువాత ముద్దులతో, కౌగిలింతలతో, శరీరంలోని సున్నిత భాగాలను శృంగారానికి ప్రేరేపిస్తూ కామ నాడులను ఉత్తేజపరచాలి. దీంతో శరీరంలో మనస్సుకు ప్రశాంతతను కలిగించే హార్మోన్ల (Calming hormones) ఉత్పత్తి జరుగుతుంది.
ఇలా మనసు ప్రశాంతంగా ఉండి ఆ కార్యంలో పాల్గొంటే శృంగారం (Romance) మరింత రసవత్తరంగా మారడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. దీంతో దంపతుల మనసుకు విశ్రాంతి కలుగుతుంది. దంపతుల మధ్య ఎన్ని గొడవలు (Conflicts) ఉన్నా పడకగదిలోకి వెళ్లగానే వారి పంతాలను పక్కనపెట్టి ఇద్దరూ కలిసి సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. నిద్రించే ముందు దంపతులు ఈ విధంగా చేస్తే ప్రశాంతత కలిగి సుఖ నిద్ర కలుగుతుంది.