
అధిక బరువు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే బరువును నియంత్రణలోనే ఉంచుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం, షుగర్, నూనె, నెయ్యి వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకున్నా శరీరం దారుణంగా బరువు పెరిగిపోతుంది. లేట్ గా జీర్ణమయ్యే ఆహారాల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్నిరకాల ఆహార పదార్థాలను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గడమే కాదు.. బరువు కూడా బాగా తగ్గుతారు. బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి..
క్యారెట్లు
క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపర్చడమే కాదు.. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా. దీనిలో బరువు తగ్గడానికి సహాయపడే బీటా కెరోటిన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సులువుగా కరిగిస్తాయి. ఇందుకోసం క్యారెడ్ సలాడ్ లేదా జ్యూస్ ను తీసుకోవచ్చు.
బెల్ పెప్పర్
బెల్ పెప్పర్ తో చేసిన వంటకాలు కూడా టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా శాండ్ విచ్ లలో ఉపయోగిస్తారు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను సులువుగా కరిగించగలదు. అలాగే ఓవర్ వెయిట్ ను కూడా తగ్గిస్తుంది.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీల్లో విటమిన్ సితో పాటుగా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోజూ కొద్ది మొత్తంలో స్ట్రాబెర్రీలను తింటే మీ శరీరానికి కాల్సిన విటమిన్ సి అందుతుంది. ఇది అధిక బరువును కూడా సులువుగా తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు మాత్రం చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎంచక్కా తినొచ్చు.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ లో ఎన్నో పోషకాలుంటాయి. దీనితో డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు కూడా చేస్తుంటారు. ఈ కూరగాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని ఎంత తిన్నా మీరు అస్సలు బరువే పెరగరు. రోజూ ఓ కప్పు కాలీఫ్లవర్ ను తినడం వల్ల ఆడవారు పెరిగే అవకాశమే ఉండదు. ఈ కూరగాయ మిమ్మల్ని వేగంగా బరువు తగ్గిస్తుంది.
పియర్స్, యాపిల్ పండ్లు
పియర్స్, ఆపిల్ పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా వీటిలో బరువును తగ్గించే ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే వీటిని రోజూ తినండి.
ఆకు కూరలు
ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో ఆకలిని తగ్గించే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కేలరీల తక్కువగా ఉంటాయి. సో బరువు తగ్గాలనుకుంటే ఆకు కూరలను మీ రోజువారి ఆహారంలో తప్పక చేర్చండి. చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
బ్రోకలీ
బ్రోకలీ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 30 నుంచి 45 ఏండ్ల వయసున్న వారికి బ్రోకలీ ఎంతో మంచిది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బ్రోకలీని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి కూడా ఎక్కువగా వేయదు.
చిక్కుడు కాయలు
చిక్కుడు కాయలు కూడా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. వీటిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆడవారు వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. అందుకే వీటిని తప్పక తినండి.