శరీరంలో ఈ ఖనిజం లోపిస్తే తలనొప్పి రావడమే కాదు.. పనిచేయకపోయినా బాగా అలసిపోతారు..

Published : Sep 12, 2022, 03:01 PM IST

మన శరీరానికి ఎన్నో రకాల ఖనిజాలు అవసరమవుతాయి. ఒక వేళ ఇవి లోపిస్తే.. శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. 

PREV
15
శరీరంలో ఈ ఖనిజం లోపిస్తే తలనొప్పి రావడమే కాదు.. పనిచేయకపోయినా బాగా అలసిపోతారు..

శరీరంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం తినే ఆహారాల్లో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉండాలి. వీటితోనే శరీరం బలంగా ఉంటుంది. మన శరీరంలో ఖనిజాల లోపం ఏర్పడితే శరీరం బలంగా ఉండదు. శరీరంలో ఎన్నో అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఇంతేకాదు.. ఖనిజాల లోపం ఎన్నో రోగాలకు దారితీస్తుంది కూడా. ఖనిజాలలో ఒకటైన ఐరన్ మన శరీరానికి ఎంతో అవసరం. 

25

ఐరన్ వల్ల కలిగే ప్రయోజనాలు

ఐరన్ వల్లే జుట్టు బలంగా మారుతుంది.  ఒకవేళ మన  శరీరంలో లోపిస్తే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉంటేనే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. అలాగే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి కూడా. శరీర భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది అలసటను, తలనొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల కండరాలు, ఎముకలు బలంగా మారుతాయి. శరీరంలో ఎలాంటి నొప్పి ఉండదు. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 
 

35

ఇనుము వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య బాగా పెరుగుతుంది. అంతేకాదు ఎలాంటి గాయాలనైనా ఇట్టే నయం చేసేస్తుంది. పిల్లలకు ఆకలిగా అనిపించకపోతే.. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలను పెడితే.. పిల్లలు పుష్టిగా తింటారు. 
 

45

ఐరన్ లోపం లక్షణాలు

శరీరంలో ఐరన్ లోపిస్తే చర్మం రంగు మారుతుంది. అంటే రంగు మారడంతో పాటుగా డ్రై గా అవుతుంది. వీటితో పాటుగా మైకము కమ్ముకుంటుంది. తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. అలాగే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఛాతిలో నొప్పి పుడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది. కాళ్లు, చేతులు చల్లగా మారుతాయి. ఏదీ సరిగ్గా ఆలోచించలేరు. జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండరు. గోర్ల రంగు పాలిపోతుంది. 
 

55

ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు

బీట్ రూట్, పిస్తాపప్పు, జామూన్, ఉసిరి, బచ్చలికూర, నిమ్మకాయ, ఆపిల్, ఎండు ద్రాక్ష, జామపండు, ఆకు కూరలైన పాలకూర, బచ్చలి కూర, బాదం, బీన్స్ , బ్రోకొలి, ఉల్లిపాయ, మటన్ లివర్, ఆలుగడ్డ, కోడిగుడ్లు, కొత్తిమీర, పల్లీలు, మటన్ లివర్, ఆప్రికాట్లు, అవకాడో, నువ్వులు,  ఖర్జూరాలు, జీడిపప్పులు, పాలు, దానిమ్మ, క్యారెట్, స్ట్రాబెర్రీలు, టమాటాలు, పుట్టగొడుగులు, మల్బరీ పండ్లు, డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories