బరువు తగ్గేందుకు ఒక ఖచ్చితమైన ప్రణాళిక చాలా అవసరం. బరువు తగ్గాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే ఫుడ్ ను ఎక్కువగా తినకూడదు. అందులో రుచిగా ఉందని ఏది పడితే అది అసలే తినకూడదు. తీపి, ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి శరీర బరువును మరింత పెంచుతాయి. ముఖ్యంగా ఖచ్చితంగా బరువు తగ్గాలనుకునే వాళ్లు కొన్ని వైట్ ఫుడ్స్ ను అసలే తినకూడదు. తెలుపు, పోషకాలు లేని, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే లేదా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదు. ముఖ్యంగా తెల్లపిండిని అసలే తినకూడదుు. ఎందుకంటే ఇవి మీ బరువును పెంచడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.