తెల్ల గుమ్మడికాయతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు.. తప్పకుండా తినండే..

Published : Nov 11, 2022, 05:01 PM IST

ప్రతిరోజూ తెల్ల గుమ్మడి కాయను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.   

PREV
17
తెల్ల గుమ్మడికాయతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు.. తప్పకుండా తినండే..

గుమ్మడికాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. కానీ దీన్ని తినడానికి ఎవరూ ఇష్టపడరు. గుమ్మడికాయ కొంచెం తియ్యగా ఉంటుంది. అయితే కొంతమంది పసుపు కలర్ లో ఉండే గుమ్మడికాయలనే తింటుంటారు. కానీ తెల్ల గుమ్మడికాయను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. దీనిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఈ కాయ మీ శ్వాసకోశ వ్యవస్థను, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పోషకాలు మీ శరీరానికి పోషకాల లోపం పోతుంది. 
 

27

తెలుపు గుమ్మడికాయల్లో దాగున్న పోషకాలు

గుమ్మడి కాయలు పసుపు, నారింజ, గోధుమ, తెలుపు రంగుల్లో ఉంటాయి. తెల్ల గుమ్మడి కాయల్లో విటమిన్ ఎ, విటమిన్-బి6, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను దూరం చేయడానికి సహాయపడతాయి. మరి దీన్ని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

తెల్ల గుమ్మడికాయలో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండెను రక్షిస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

47

యాంటీ డిప్రెసెంట్

ట్రిప్టోఫాన్ లోపించడం వల్ల డిప్రెషన్ సమస్య వస్తుంది. తెల్ల గుమ్మడికాయలో ఎల్-ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన అమైనో-ఆమ్లం. దీన్ని మన శరీరం సొంతంగా తయారుచేయలేదు. తెల్ల గుమ్మడికాయను తీసుకోవడం వల్ల నిరాశ తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. మొత్తంగా ఇది డిప్రెషన్ ను తగ్గిస్తుంది.  
 

57

తెల్ల గుమ్మడికాయలో లుటిన్, జియాక్సంతిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కళ్ళను రక్షిస్తాయి. కంటి శుక్లాలను నివారించడానికి సహాయపడతాయి. తెల్ల గుమ్మడికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల విటమిన్ ఎ ఎక్కువగా అందుతుంది. ఇది కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

67

గుమ్మడికాయలో ఉండే ఆకుపచ్చని విత్తనాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, కీళ్ల వాపును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. గుమ్మడికాయ గుజ్జుతో తయారు చేసిన మూలికా కషాయాన్ని తాగడం వల్ల పేగుల మంట తగ్గుతుంది. 

77

తెల్ల గుమ్మడికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ వ్యవస్థను అంటువ్యాధులు, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అందుకే ఇది ఆస్తమా రోగులకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories