షుగర్ వ్యాధి ఉంటే మగవారి కంటే ఆడవారికే ఎక్కువ రోగాలొస్తయ్.. అవేంటంటే..?

Published : Nov 11, 2022, 04:07 PM IST

టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ తో పాటుగా.. మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. అయితే ఈ డయాబెటీస్ కు సంబంధించి వచ్చే సమస్యలు మగవారి కంటే.. ఆడవారికే ఎక్కువ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.     

PREV
16
 షుగర్ వ్యాధి ఉంటే మగవారి కంటే ఆడవారికే ఎక్కువ రోగాలొస్తయ్.. అవేంటంటే..?

లైఫ్ స్టైల్ లో కొన్ని తప్పుల వల్లే  టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఈ డయాబెటీస్ పెద్దలు, ముసలివాళ్లకే ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు, యువతకు కూడా వస్తుంది. ఈ డయాబెటీస్ మగవారికి, ఆడవారికి సమానంగా వస్తుంది. కానీ.. టైప్ -1, టైప్ -2 డయాబెటీస్ పక్కాగా వస్తుంది. కానీ ఆడవారికి గర్భధారణ సమయంలో ఎక్కువగా వస్తుంది. ఇలాంటి డయాబెటీస్ డెలివరీ తర్వాత తగ్గిపోతుంది. అయితే కొంతమందికి ఇలాంటి డయాబెటీస్ డెలివరీ తర్వాత కూడా అలాగే ఉంటుంది. డయాబెటీస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా వస్తాయి. అవేంటంటే.. 

26

మూత్రనాళ సంక్రామ్యత

డయాబెటీస్ ఉన్న ఆడవారికి మూత్రనాళ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధి వల్ల మూత్రం మొత్తం పెరుగుతుంది. ఇది మూత్రనాళ సంక్రామ్యతలకు దారితీస్తుంది. యోని సంక్రామ్యతలు కూడా సంభవించొచ్చు. 
 

36

రుతుక్రమ రుగ్మతలు

డయాబెటీస్ ఉన్న కొంత మంది ఆడవారికి రుతుక్రమ రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్క ఆడవారిలో కనిపిస్తుందని చెప్పలేం. దీనివల్ల పీరియడ్స్ కాలాలు మారొచ్చు.

46

పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్

పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా పిసిఒఎస్ ఉన్న మహిళలకు కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిసిఒఎస్ సమస్యను డయాబెటిస్ ఉన్న ఆడవారిలో కనిపిస్తుంది. 
 

56

జెస్టేషనల్ డయాబెటిస్

'జెస్టేషనల్ డయాబెటిస్' అని పిలువబడే డయాబెటిస్ అనేది గర్భధారణ సమయంలో సంభవిస్తుంది. దీనివల్ల కొంతమంది మహిళల్లో ఎక్కువ బరువున్న పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య కాదు. గర్భధారణ సమయంలో డయాబెటిస్ వచ్చే మహిళలకు తర్వాత కూడా టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 

66

వివిధ అధ్యయనాల ప్రకారం.. డయాబెటిస్ ఉన్న కొంతమంది మహిళల్లో గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, నిరాశకు దారితీస్తుంది. ఇవన్నీ మళ్లీ డయాబెటిస్ పెరగడానికి దారితీస్తాయి. అలాగే రుతువిరతి మహిళల్లో ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే పురుషుల కంటే మహిళలే ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories