Weight Loss Tips:బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను అస్సలు తినకండి..

First Published Jan 24, 2022, 4:54 PM IST


Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అప్పుడే వెయిట్ లాస్ అవుతారు. అలాగే అధిక బరువున్న వారు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటి వల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశం ఉంది. 
 

Weight Loss Tips: ఆధునిక కాలంలో స్థూలకాయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనికి కారణం మారిన జీవనశైలి. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. దానికి తోడు శారీరక శ్రమ లేకపోవడం. వీటన్నింటి వల్ల అధిక బరువు సమస్య ఎదురవుతుంది. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో వ్యాయామాలు చేయడం, డైట్ లు పాటించడం, వర్కౌట్స్ చేయడం వంటి చేస్తూ ఎంతో కష్టపడిపోతుంటారు. అయినా ఈ సమస్య తప్పిందా అంటే అదీ ఉండదు. ఈ ప్రాసెస్ లోనే బరువు పెరగకుండా ఉండేందుకు అన్నం తినడానికి ముందుగా ఫ్రూట్ సలాడ్ ను తగుతున్నారు. అయితే ఈ ఫ్రూట్ సలాడ్ లో కొన్ని పండ్లను వేయడం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని రకాల పండ్ల వల్ల శరీర బరువు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం పదండి.


శరీర బరువు కోల్పోవాలనుకునే వారు పైనాపిల్ పండుకు దూరంగా ఉండాలి. ఈ పైనాపిల్ పండు ఆరోగ్యానికి మేలు చేసేదైనా.. శరీర బరువు పెరిగేలా చేయడంలో ఈ పండు ముందుంటుంది. ఎందుకంటే ఈ పండులో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. అలాగే క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువును తగ్గించుకోవాలనుకునేవారు ఈ పండుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇకపోతే డైట్ లో ఉన్నవారు ద్రాక్షపండును అధికంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పండులో కొవ్వులు, చక్కెర స్థాయిలు పుష్కలంగా లభిస్తాయి. కాగా మోతాదుకు మించి ఈ పండును తీసుకుంటే పక్కాగా బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ద్రాక్షను తక్కువగా తీసుకోవాలి.

అన్ని పండులలో అరటి పండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. కానీ బరువు కోల్పోవాలనుకునే వారికి ఈ పండు మంచిది కాదు. ఎందుకంటే ఈ పండులో షుగర్ లెవెల్స్ చాలా మొత్తంలో ఉంటాయి. అలాగే కేలరీలు సుమారుగా 150 వరకు ఉంటాయి. అందుకే ఈ పండ్లను పరిమితిలోనే తినాలి. అంటే రోజుకు రెండు నుంచి మూడు తిన్నా ఏమీ కాదు. కానీ అంతకంటే ఎక్కువ తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. 
 

పండ్లలో రారాజైన మామిడి పండులో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు మామిడి పండ్లను తినకూడదు. అంతగా తినాలనుకునే వారు ఒకటి లేదా రెండు ముక్కలను మాత్రమే తినాలి. 
 

అవకాడో పండులో కూడా కేలరీలో ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. అంతేకాదు అధిక మొత్తంలో కొవ్వులు కూడా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ పండుకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా బరువు తగ్గడం కోసం డైట్ పాటించే వారు  పండ్లకు, కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. 
 

click me!