Omicron Variant : ఒమిక్రాన్ ఒక వ్యక్తికి ఎన్ని సార్లు సోకుతుందో తెలుసా?

First Published Jan 24, 2022, 3:03 PM IST

Omicron Variant : టీకాలు వేసుకోకపోయినా.. వేసుకున్నా.. కరోనా ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో చాలా మందికి ఒకసారి కంటే ఎక్కువ సార్లే కరోనా సోకింది. మరి థర్డ్ వేవ్ లో వచ్చిన ఒమిక్రాన్ ఒకే వ్యక్తికి ఎన్ని సార్లు సోకుతుందంటే..?

Omicron Variant : ఒకటి పోతే  ఇంకోటి తగులుకున్నట్టు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ పోయిందనుకున్న సమయంలోనే కరోనా థర్డ్ వేవ్ అంటూ ప్రజలపై విరుచుకుపడుతోంది. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సునామిలా మారి ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ డెల్టా వేరియంట్ కంటే ఇంకా ఫాస్ట్ గా వ్యాపిస్తుందని ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పారు. దీని లక్షణాలు తీవ్ర స్థాయిలో లేకపోయినప్పటికీ ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా సోకుతుందని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. 

అయితే ఒమిక్రాన్ కు గురించి బయపడాల్సిన విషయం ఏమిటంటే.. ఇది శరీరంలోని Antibodies నుంచి ఈజీగా తప్పించుకుంటుందట. అలాగే వ్యాక్సినేషన్  ద్వారా తయారైన యాంటీబాడీలను కూడా ఈ వేరియంట్ ఎదుర్కోగలదని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అందుకే టీకా వేసుకున్నా ఒమిక్రాన్ బారిన పడుతున్నారని నిపుణులు అభిప్రయపడుతున్నారు. 

అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లల్లో ఒకే వ్యక్తి ఈ వైరస్ ఒకటి కంటే ఎక్కువ సార్లే సోకింది. అలాగే డెల్టా వేరియంట్ కూడా రెండు సార్లు సోకిన వారున్నారు. మరి ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక వ్యక్తికి ఎన్ని సార్లు సోకే ప్రమాదం పొంచి ఉందని ప్రస్తుతం ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న ఇదే. అయితే ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకే ప్రమాదం డెల్టా వేరియంట్ కంటే 4 రెట్లు ఎక్కువని కొన్ని నివేదికలు వెళ్లడిస్తున్నాయి. అంటే ఒమిక్రాన్ ఒకే వ్యక్తికి రెండు సార్లు సోకే ప్రమాదముందని పరిశోధకులు భావిస్తున్నారు.
 

దీనికి తోడు శరీరంలోని Antibodies ను ఈజీగా ఒమిక్రాన్ ఓడించగలదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ వైరస్ టీకా వేసుకోని వారికి,  టీకా వేసుకున్న వారికి కూడా ఈజీగా సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీని బారిన పడకుండా ఉండేందుకు తగిన  జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఎన్నో సలహాలను, సూచనలను తెలియజేస్తుంది. వాటన్నింటినీ తూ.చ తప్పకుండా పాటిస్తే కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. అలాగే అత్యవసరమైతేనే బయటకువెళ్లేలా చూసుకోండి.  జనాల మధ్యకు వెళ్లినప్పుడు సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలి. అలాగే డబుల్ మాస్క్ లను ధరించడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేయడం తప్పనిసరి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే..  తరచుగా మీ చేతులు మాస్కును, ముక్కును, నోటిని, కళ్లకు తాకకుండా జాగ్రత్తపడాలి. కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుకంటేనే దీని నుంచి తప్పించుకోగలం.

click me!