Women Empowerment: ధైర్యవంతులైన మహిళలు ఈ విషయాల్లో అస్సలు వెనక్కి తగ్గరు..

First Published | Jan 24, 2022, 4:05 PM IST

Women Empowerment: కాలాలు మారుతున్నాయి.. జీవితం ముందుకు సాగుతోంది. అయినా కొందరు మహిళలు నేటికీ బానిసలుగానే బ్రతుకున్నారు. తప్పు వాళ్లది కాదు. ఈ సమాజానిది. అవును తరతరాలుగా మహిళలు ఇలాగే బ్రతుకుతున్నారంటూ వాళ్ల ప్రతిభకు, వారి స్వేచ్ఛా జీవితానికి సంకెళ్లు వేస్తున్నారు..

Women Empowerment:ఏ శతాబ్దం అయితే ఏంటీ.. లోకం ఎంత అభివృద్ధి జరిగితే మాకేంటి.. మా జీవితాల్లో మార్పు రాదు. మేము బానిసలం.. వాళ్లు చెప్పింది తూ.చ తప్పకుండా మేము చేసి తీరాలి అని బాధపడే మహిళలు నేటికీ ఎంతో మంది ఉన్నారు.  ప్రస్తుత సమాజంలో చాలా మంది మహిళలు పురుషుల ఆదిపత్యం కిందే బతుకుతున్నారు. వాళ్లు ఏది చెప్తే అదే వేదం. అలాగే బతకాలి. వారికంటూ కోరికలుండకూడదు. తిరిగే స్వేచ్ఛ  అసలుకే లేదు. అందుకే నేటి ఆధునిక కాలంలో కూడా లింగ సమానత్వం లేదు. 

అరచేతిలో ప్రపంచాన్నే చూసే ఈ సమాజంలో కొందరి ఆడవారికి స్వేచ్ఛ అనేదే కరువైంది. కానీ కొంత మంది ఆడవారు ఈ సమజాన్ని ,  తమ తల్లిదండ్రులను ఎదిరించి ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతున్నారు. లోకం గర్వించే పొజీషన్ కు చేరుకుంటారు. వీరే ధైర్యవంతులైన స్త్రీలని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పురుషులతో సమానంగా, అంతకంటే ఎక్కువ స్థాయికే చేరుకుంటూ సమాజం గర్వించే విధంగా ఎదుగుతున్నారు. ఇలాంటి వారే ఎలాంటి సమస్యలనైనా అధిగమించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇలాంటి స్త్రీలు కొన్ని విషయాలకు అస్సలు రాజీ పడరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Latest Videos


లోకంతో పోటీపడే ఆడవారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు, కట్టుబాట్లకు తలవొంచరు. అవసరమైన కట్టుబాట్లనే పాటిస్తూ ఆ సమయాన్ని తమ కోసం ఉపయోగించుకుంటారు. మేం ఎంతో సాధించాల్సి ఉందని గుర్తిస్తారు. 

ఒక వ్యక్తి కోసమని తమ ఆత్మగౌరవాన్ని అస్సలు వదులుకోవడానికి సిద్దంగా ఉండరు. అవసరమైతే ఎదుటివారిని ఎదిరించడానికి అస్సలు వెనకాడరు. పురుషులతో సమానంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు తప్ప ఓటమిని ఎప్పటికీ అంగీకరించరు. బలమైన ఆడవారెప్పుడు తమకు తామే కొన్ని సరిహద్దులను ఏర్పటుచేసుకుంటారు. తమకు ఇష్టమైన అంశాలనెప్పుడు మార్చాలనుకోరు. అందులోనూ వారు ఆత్మవిశ్వాసం గల వ్యక్తులుగా భావిస్తారు. అందులోనూ కొంతమంది మగవారు తమకంటే గొప్పవారైన మహిళలతో పోల్చుకోవడానికి అస్సుల ఇష్టపడనప్పుడు.


కొంతమంది ఆడవారు Perfect గా ఉండాలని అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే అలా ఉంటే వారిపై చాలా బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి. మనుషులన్నాక తప్పులు చేయడం కామన్ కాబట్టి. అలాంటిది ఆడవారికి ముందే కట్టుబాట్లను విధిస్తారు.  ఒక వ్యక్తి భావోద్వేగానికి గురైతే అతడు బలహీనంగా మారాడని భావిస్తుంటారు. నిజానికి భావొద్వేగానికి గురైతే బలహీనమవుతారని ఎక్కడా చెప్పలేదు. ఈ విషయం ధైర్యవంతులైన ఆడవారికి బాగా తెలుసు. అందుకే భావోద్వేగాలను ఎలా అర్థం చేసుకోవాలో వారికే బాగా తెలుసు. 


ఆడవారు చక్కటి ప్రతిభను కలిగిఉంటారు. కానీ కొంతమంది పురుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు సరికదా వారితో చెడుగా ప్రవర్తిస్తారు. కానీ ఎంతటి కష్టతరమైన పనిని కూడా ఈజీగా చేయగల సామర్థ్యం ఆడవారిలో కలదు. ఆడవారిలో మగవారిలోల కంటే ధైర్యం ఎక్కువే ఉంటుంది. అందుకే ఎంతకష్టతమైన పనిని చేయడానికి కూడా వెనకాడరు. అందుకే వారు జీవితంలో ఘన విజయాన్ని అందుకుంటారు. 

click me!