బరువు తగ్గాలంటే జస్ట్ ఎక్సర్ సైజెస్ చేస్తే సరిపోదు.. వీటిని కూడా తినాల్సిందే.. !

First Published Oct 1, 2022, 12:57 PM IST

బరువు తగ్గాలని గంటలకు గంటలు జిమ్ లో వర్కౌట్స్ చేసే వారు చాలా మందే ఉన్నారు. వీటితో పాటుగా కొన్ని రకాల ఆహారాలను తింటేనే ఫాస్ట్ గా బరువు తగ్గుతారన్న ముచ్చట మీకు తెలుసా..? 
 

బరువు తగ్గాలని గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. అయినా బరువును తగ్గనివారున్నారు. నిజానికి బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటుగా కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలను కూడా తినాల్సి ఉంటుంది. అప్పుడే మీరు కోరుకున్న బాడీ వెయిట్ మీ సొంతం అవుతుంది. మరి ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి. 

బెర్రీలు

సాధారణంగా బెర్రీలు చాలా రకాలుంటాయి. బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్బెర్రీలు, స్ట్రాబెర్రీలు అంటూ రంగురంగుల్లో నోరూరిస్తాయి. ఈ బెర్రీల్లో కేవలం కేలరీలు 32 మాత్రమే ఉంటాయి. అలాగే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని బరువు తగ్గాలనుకునేవాళ్లు తప్పకుండా తినాలి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో ప్రాణాంతక రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. 
 

కీర దోసకాయ

కీరాల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 100 గ్రాముల కీరాలో కేవలం 15 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల దాహం తీరుతుంది. ఇది బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది. ముఖ్యంగా ఇది డయాబెటీస్ లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ తో కూడా పోరాడుతుంది. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 

క్యారెట్లు

100 గ్రాముల క్యారెట్లలో 41 కేలరీలు ఉంటాయి. క్యారెట్లలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. క్యారెట్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ కె ఎక్కువ మొత్తంలో ఉంటాయి.  ఇవన్నీ బరువు తగ్గేందుకు సహాయపడతాయి. 
 

బ్రోకలీ

100 గ్రాముల బ్రోకలీలో 34 కేలరీలు ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ లు రక్తహీనతను తగ్గిస్తాయి. అలాగే ఎముక ఏర్పడటానికి, ఎముకలను బలంగా ఉంచే ఫాస్పరస్, కాల్షియం , విటమిన్ కె లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బ్రోకలీలో ఉండే కాంప్పెరోల్ అనే ఫ్లేవనాయిడ్ శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం మెదడు ఏర్పడటానికే కాకుండా బ్రెయిన్ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. 
 

పాలకూర

బ్రోకలీలో లాగే పాలకూర క్రూసిఫరస్ కుటుంబానికి చెందినది. 100 గ్రాముల పాలకూరలో కేవలం 15 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఈ పాలకూరలో విటమిన్ సి, కాల్షియం, విటమిన్ కె, విటమిన్ ఎలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ కళ్లను, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

ఆపిల్స్

100 గ్రాముల ఆపిల్ పండులో 50 కేలరీలు ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఈ పండు తొందరగా ఆకలి కానీయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా ఆపిల్ పండును తినాలని నిపుణులు చెబుతున్నారు.  దీనిలో ఉండే కరిగే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఆపిల్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

టమాటాలు

100 గ్రాముల టమాటాల్లో కేవలం 19 కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తో పాటుగా పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. టమాటాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడానికి సహాయపడతాయి.  ఈ ఆహారాలను తినడం వల్ల మీ జీవక్రియ రేటు పెరుగుతుంది. కేలరీలు కూడా బర్న్ అవుతాయి.  
 

click me!