ధూమపానం , మద్యపానం అనేది అనారోగ్యకరమైన అలవాట్లు, ఇవి మీ దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, మీ సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతాయి. అనేక అధ్యయనాల ప్రకారం, సిగరెట్ తాగడం,మద్యం సేవించడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది.సంతానోత్పత్తి తగ్గుతుంది. మీరు గర్భం ధరించాలని చూస్తున్నట్లయితే, మీరు ధూమపానం మానేయాలని, మీ ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.