బరువు తగ్గాలనుకుంటునోళ్లు పాప్ కార్న్ తినొచ్చా?

First Published Feb 2, 2023, 1:50 PM IST

బరువు తగ్గడం అస్సలు కాని పని అని అనుకునేటోళ్లు చాలా మందే ఉన్నారు. నిజమేంటంటే.. సింపుల్ గా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు కాస్త ఓపిక ఉండాలంతే. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను మానేస్తే సులువుగా బరువు తగ్గొచ్చు. 
 

Popcorn

పాప్ కార్న్ రుచి అదిరిపోతుంది. అందుకే వీటిని అన్ని వయసుల వారు ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా సినిమా థియేటర్  వెళ్లినప్పుడు ఒక్క పక్క సినిమా చూస్తూ.. ఇంకోపక్క పాప్ కార్న్ ను లాగించడం చాలా మందికి అలవాటు. పాప్ కార్న్ కున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించడం. నిజానికి పాప్ కార్స్ మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ పాప్ కార్న్ లో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

అయితే ఈ పాప్ కార్న్ ను బరువు తగ్గాలనుకునేవారు తినొచ్చా? లేదా? అన్న డౌట్లు చాలా మందికి వస్తుంటాయి. నిజం చెప్పాలంటే ఎవ్వరైనా పాప్ కార్న్ లను ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా తినొచ్చు. ఎందుకంటే పాప్ కార్న్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పాప్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పాప్ కార్న్ ను తినొచ్చు. అయితే పాప్ కార్న్ ను తయారుచేసేటప్పుడు అందులో వెన్న, స్వీట్లు లేదా మరేదైనా కృత్రిమ పదార్థాలను కలపకండి. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారికి ఇది హానికరం. బరువు తగ్గాలనుకునే వారు ఉప్పు, తీపి, వెన్న లేదా క్యారమెల్ లేని పాప్ కార్న్ ను మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. 

Popcorn

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పాప్ కార్న్ ను తినొచ్చు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఉండటం కూడా డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఏ మాత్రం పెంచవు. కాకపోతే బయట దొరికే పాప్ కార్న్ లను కాకుండా ఇంట్లోనే తయారుచేసుకున్న  పాప్ కార్న్ లను తినాలి. కానీ మరీ ఎక్కువగా తింటే అమృతం కూడా విషమే అవుతుంది. అందుకే వీటిని లిమిట్ లోనే తినండి. 

మొక్కజొన్న వంటి తృణధాన్యాలు కొరోనరీ గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది పాలీఅన్శాచురేటెడ్ నూనెను కలిగి ఉంటుంది. మొక్కజొన్నలో కనిపించే ఫైబర్ మీ శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాక తృణధాన్యాల ఆహారాలలో తక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అయినప్పటికీ పాప్ కార్న్ ను మితంగా తినడమే మంచిది. 

మలబద్దకాన్ని తగ్గించొచ్చు

పాప్ కార్న్ లో మంచి మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డైటరీ ఫైబర్ పిల్లలు, పెద్దలలో మలబద్దకాన్ని నివారిస్తుంది. 
 

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

మియామి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మొక్కజొన్నలో ఉండే ఫైబర్ పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మీ ఆహారంలో మొక్కజొన్న ఫైబర్ ను జోడించడం వల్ల ఉదర అసౌకర్యం కూడా తగ్గుతుంది. పాప్ కార్న్ ను మితంగా తింటే మీ జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 

click me!