అక్కడ ఈ సమస్యలా? అయితే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.. లేదంటే?

First Published Feb 2, 2023, 11:55 AM IST

బయటకు కనిపించే శరీర భాగాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండే వాళ్లు ఉన్నారు. మరి కనిపించని శరీర భాగాల సంగతేంటి? వీటి ఆరోగ్యాన్నిపట్టించుకోకపోవడం వల్ల ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా? ముఖ్యంగా యోని ఆరోగ్యాన్ని. అవును ఆడవారు యోని ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే లేనిపోని తిప్పలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

యోని ఆడవారి శరీరంలో సున్నితమైన అవయవం. దీని ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకపోయినా పెద్ద పెద్ద సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ మనలో చాలా మంది యోని ఆరోగ్యాన్ని లైట్ తీసుకుంటారు. దాన్ని ఆరోగ్యాన్ని పట్టించుకోవడానికి ఏముందని అనుకుంటారు. ఇలా అనుకుంటే మాత్రం మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. పొత్తికడుపులో నొప్పి లేదా యోని దురద కావచ్చు. ఇవన్నీ యోని ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పే సంకేతాలు. కానీ చాలాసార్లు మనం ఈ సమస్యలను పట్టించుకోం. అవే తగ్గిపోతాయిలే అని వదిలేస్తాం. కానీ దీని వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది తెలుసా? యోని ఆరోగ్యం దెబ్బతింటే ఇంకా ఎన్నో సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

యోని దురద

యోని దురద సాధారణంగా యోని పొడిబారడం వల్ల వస్తుంది. పరిశుభ్రత లేకపోవడం, యుటిఐ వల్ల కూడా ఇలా జరుగుతుంది. అలాగే చిక్కగా వైట్ discharge,దురద వస్తుంటే.. అది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు  సంకేతం. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు ఏ మాత్రం కేర్ లెస్ గా ఉండకండి. ఎందుకంటే ఇది మూత్రాశయ సంక్రమణకు దారితీస్తుంది. చాలా సార్లు ఈ ఇన్ఫెక్షన్ కాలేయానికి చేరుకుంటుంది. అందుకే యోనిలో దురద పెడితే వెంటనే  హాస్పటల్ కు వెళ్లండి. 

కారణం లేకుండా రక్తస్రావం

రెగ్యులర్ సెక్స్ సమయంలో, మూత్ర విసర్జన చేసేటప్పుడు లేదా పీరియడ్స్ ముగిసిన తర్వాత యోని నుంచి రక్తస్రావాన్ని గమనించారా? అయితే మీ యోని ఆరోగ్యం బాలేదని అర్థం చేసుకోండి. అంటే యోని నుంచి ఎక్కువ రక్తస్రావం కావాల్సిన అవసరం లేదు. ఇన్నర్ పై కొన్ని చుక్కల రక్తపు మరకలు కనిపించినా.. అది ప్రమాదానికి సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్య మీలో కనిపించినప్పుడు వీలైనంత తొందరగా గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.
 

మూత్రాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవడం

మూత్రాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవడం అంత మంచిది కాదు. దీనికి ఎన్నో ప్రమాదకరమైన కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మూత్ర సంక్రమణ, కటి కండరాలు బలహీనపడటం వంటివి. కటి కండరాలు మన శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలు స్థిరంగా ఉండటానికి, అవి సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ఇది మూత్రాశయ ప్రక్రియను సమతుల్యం చేస్తుంది. ఒకవేళ మీ కటి కండరాలు బలహీనపడితే మీ మూత్రాశయం ప్రభావితం అవుతుంది. అలాగే మూత్రాన్ని ఆపలేకపోతుంటారు. అలాగే మూత్రం లీకేజీ సమస్య తలెత్తుతుంది. అందుకే యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే కటి కండరాలను బలంగా ఉంచడానికి ప్రయత్నించండి. దీని కోసం వైద్యుడిని సంప్రదించండి. 

యోని చుట్టూ ఉన్న చర్మంపై గడ్డలు 

సాధారణంగా షేవ్ చేయడం వల్ల యోని చుట్టూ ఉన్న చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కానీ గడ్డలు కనిపించడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది తీవ్రమైన సమస్యకు సంకేతం కావొచ్చు. యోని చుట్టూ ఉన్న చర్మం చికాకును కలిగిస్తుంటే.. మీరు హెర్పెస్ ఇన్ఫెక్షన్ కు గురై ఉండొచ్చు. దీన్ని లైట్ తీసుకుంటే ఇది కాలక్రమేణా తీవ్రమైన సమస్యగా మారుతుంది. అందుకే ఇలాంటి సమస్య కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోండి. 

పొత్తికడుపులో నొప్పి

దిగువ పొత్తికడుపులో నొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. కండరాల సమస్యలు, మూత్ర ఇన్ఫెక్షన్ లు, గర్భాశయం, ప్రేగు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల వల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. ఈ సమస్యలన్నీ చాలా తీవ్రమైనవి. అలాగే ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అందుకే యోని పైన కడుపు దిగువ భాగంలో నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించండి. 
 

click me!