వామ్మో.. వంట నూనె కొలెస్ట్రాల్ ను పెంచుతుందా?

First Published Feb 2, 2023, 12:59 PM IST

కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న వంటనూనె, కొలెస్ట్రాల్  లేని వంట నూనెలు అంటూ వంటనూనెల గురించి వినే ఉంటారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం.. వంట నూనెలు కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతాయి. అందుకే మీరు తినే వంటనూనె కొలెస్ట్రాల్ ను పెంచుతుందా? లేదా? అనేది చూసుకోవాలంటున్నారు నిపుణులు. 
 

మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించడానికి ఎన్నో రకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. కానీ వివిధ రకాల నూనెలను ఉపయోగించి తయారు చేసే ఆహారం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బదులుగా ఎన్నో రెట్లు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కారణం నూనెను ఎక్కువ పరిమాణంలో ఉపయోగించడం. ఒకే నూనెను ఉపయోగించడం లేదా ఒకే పాత్రలో ఉంచిన నూనెను పదేపదే ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు ఉపయోగించే వంటనూనె కొలెస్ట్రాల్ పెంచేదిగా ఉండకుండా చూసుకోండి. అసలు వంట నూనెలు చెడు కొలెస్ట్రాల్ కు ఎలా కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

ఒకే నూనెను తరచుగా వాడటం ప్రమాదకరం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ నూనెనైనా లిమిట్ లోనే వాడాలి. ఏదైనా నూనెను ఎక్కువగా వాడితే.. అది ఖచ్చితంగా శరీరానికి హాని చేస్తుంది. అందుకే వంటనూనెలను మార్చుతూ ఉండండి. అంటే ఒక రోజు ఆవనూనె, మరుసటి రోజు ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత రోజూ నువ్వుల నూనె. నూనెను ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక రకమైన నూనెను ఎప్పుడూ ఉపయోగించడం వల్ల ధమనులలో అడ్డంకులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ మన గుండె ధమనులను దెబ్బతీస్తుంది. ఇది రక్త కణాలలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఇది గుండెపోటుకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ ఇది చేతులు, కాళ్లు వంటి అన్ని నరాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం మొదలవుతుంది.
 

వంట నూనె కొలెస్ట్రాల్ ను ఎలా పెంచుతుంది?

కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి నూనె అంటే కొవ్వులు తీసుకోవడాన్ని చాలా వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఆహార కొవ్వులు కొలెస్ట్రాల్ తో సంబంధం కలిగి ఉంటాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల రూపంలో ఉన్న కొవ్వు, నూనెలు శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ గుండెకు చాలా మంచిది. నిజానికి కొవ్వు శరీరం విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె లను బదిలీ చేస్తుంది. అలాగే ఇద ఆకలి కోరికలను తీర్చడానికి కూడా సహాయపడుతుంది. 

సంతృప్త కొవ్వు రక్త నాళాలను నిరోధించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ముఖ్యంగా వెన్న, జున్ను, ఐస్ క్రీం, పాలతో సహా మొత్తం పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నూనె, పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, కోకో వెన్న కూడా పెద్ద మొత్తంలో సంతృప్త కొవ్వును సరఫరా చేస్తాయి. అయితే ఇవి కొలెస్ట్రాల్ ను దూరం చేస్తాయి.

=

ఆవనూనె మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఆవనూనె చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్, జలుబు, దగ్గును తగ్గిస్తాయి. అలాగే  జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఆవనూనె శరీరంలోకి వెళ్లి డీఏగా పనిచేస్తుంది. దీని వినియోగం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రీసెర్చ్ గేట్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో సుమారు 67 శాతం ప్రజలు ఉత్తర, ఈశాన్య, తూర్పు ప్రాంతాలలో మూడు రకాల వంట నూనెలను ఉపయోగిస్తున్నారు. అవే ఆవ నూనె, పామాయిల్, సోయాబీన్ నూనెను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. వీరిలో కూడా ఎక్కువ మంది ఆవనూనెనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారట. ఆవ నూనె వంటల రుచిని పెంచుతుంది. వంటనూనెల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా 12 శాతం, దేశానికి 80 శాతం వాటా ఉంది. రాజస్థాన్ లో ఆవాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశ చమురులో 50 శాతానికి పైగా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది.

click me!