జస్ట్ 10 రోజుల్లోనే బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే పడుకునే ముందు ఈ పనులను తప్పకుండా చేయండి..

First Published Jan 8, 2023, 10:51 AM IST

ఎంత డైట్ పాటించినా.. ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు ఏ మాత్రం తగ్గడం లేదా. అయితే పడుకునే ముందు ఈ ఆరు పనులను చేస్తే మాత్రం మీరు చాలా ఫాస్ట్ గా, ఈజీగా బరువు తగ్గుతారు తెలుసా. 
 

weight loss tips

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలతో మొదలుకొని యువకులు, పెద్ద వయసు వారు కూడా అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. బరువు విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలెన్నో. ఏదేమైనా  బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గరన్న సంగతి దాదాపుగా అందరికీ ఎరుకే. అసలు ఏం చేస్తే బరువు తగ్గుతారో తెలియడం లేదా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ పనులను  చేయండి. వీలైనంత తొందరగా, చాలా సులువుగా బరువు తగ్గుతారు. 

ఆహారం

బరువు తగ్గాలా? వద్దా? అనేది మీరు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం రాత్రిళ్లు మీరు తేలికపాటి ఆహారాలనే తినాలి. బరువు తగ్గడానికి ఏం తింటున్నమనేదే కాదు.. ఎప్పుడు తింటున్నాం అనేది కూడా ముఖ్యమే. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు పడుకోవడానికి రెండు గంటల ముందే తినడం మంచిది. ఇలా తింటేనే మీరు తిన్న ఫుడ్ సులువుగా జీర్ణమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. తిన్న తర్వాత 100 అడుగులైనా పక్కాగా నడవాలి. 

ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోండి

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఎలా అంటే ఇది ఇంకా ఇంకా తినాలన్న ఆహార కోరికలను తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు రాత్రి తినడానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. ఆపిల్ సైడర్ వెనిగర్ మన శరీరాన్ని నిర్వీషీకరణ చేస్తుంది. అలాగే మీరు అతిగా తినకుండా చేస్తుంది.దీని వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

రాత్రిపూట ఆల్కహాల్ ను తాగకూడదు

ఆల్కహాల్ ను తాగితే బాడీ వెచ్చగా ఉంటుందని ఈ చలికాలంలో చాలా మంది ఖచ్చితంగా ఆల్కహాల్ ను తాగుతుంటారు. నిజానికి ఆల్కహాల్ మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాదు.. మీ బరువును కూడా అమాంతం పెంచుతుంది. ఎందుకంటే దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పడుకునే ముందు మందును తాగితే  మీరు చాలా వేగంగా బరువు పెరుగుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం రాత్రిళ్లు మందును తాగకండి. 

meditation

ధ్యానం చేయండి

బరువును పెంచే కారకాల్లో ఒత్తిడి కూడా ఒకటి. విపరీతమైన టెన్షన్స్ వల్ల కూడా బరువు పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది టెన్షన్ లో మోతాదుకు మించి తినేస్తుంటారు. దీనివల్ల బరువు పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పడుకునే ముందు ధ్యానం చేయండి. ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది. 
 

bath

గోరువెచ్చని నీటితో స్నానం

బరువు తగ్గడానికి నిద్రకూడా ఎంతో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పడుకునే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.. ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతంగా పడుకుంటారు. ఎందుకంటే వేడి నీరు మన శరీరాలకు మంచి విశ్రాంతినిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు కూడా మన  శరీరాల్లో ఉండే ఫ్యాట్ కరిగిపోతుంది. దీంతో మీరు మరింత వేగంగా బరువు తగ్గుతారు. 

టీ, కాఫీలను తాగకండి

సాయంత్రం 6 గంటల తర్వాత టీ, కాఫీలను తాగకపోవడమే మంచిది.  ఎందుకంటే టీ, కాఫీల్లో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మీకు నిద్రలేకుండా చేస్తుంది. రాత్రిళ్లు ప్రశాంతంగా పడుకోకుంటే మెటబాలిజం దెబ్బతింటుంది. దీంతో మీరు బరువు పెరిగిపోతారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు నైట్ టైం టీ, కాఫీలను తాగకపోవడమే మంచిది. 

click me!