బియ్యం, మొక్కజొన్న, గోధుమలతో పోలిస్తే రాగుల్లోనే పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. రాగులను తింటే ఆహార కోరికలు తగ్గుతాయి. అంతేకాదు జీర్ణక్రియ వేగం పెరుగుతుంది. తత్ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రాగులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో లేదా మధ్యాహ్న భోజనంలో తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.