chia seeds
చియా గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మాంగనీస్, ఫైబర్, విటమిన్ బి3, విటమిన్ బి2, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి2 పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి మనల్ని కాపాడుతాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే చాలా మంది వీటిని తింటే బరువు తొందరగా తగ్గిపోతామని భావిస్తారు. ఇందులో నిజమెంత? దీని గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు గురించి ఇపుుడు తెలుసుకుందాం పదండి.
కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చియా విత్తనాలు కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీనివల్ల ఎక్కువగా తినాలనే కోరికలు రావు. ఈ గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్లే తినాలనే కోరికలు చాలా వరకు తగ్గిపోతాయి. దీంతో మీరు కేలరీలను ఎక్కువగా తీసుకోలేరు. ఫలితంగా ఇది కేలరీలను బర్న్ చేయడానికి శరీరానికి ఎక్కువ సమయం ఇస్తుంది.
చియా విత్తనాలు మాత్రమే పనిచేయవు
నిజానికి చియా విత్తనాలు ఒక్కటి తింటేనే బరువు తగ్గుతారనే దానిలో నిజం లేదంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలంటే చియా గింజలతో పాటుగా.. శరీరానికి అవసరమైన పోషకాహారం కూడా తీసుకోవాలి. ఇందుకోసం తాజా పండ్లు, కూరగాయలను తినాలి.
ముందుగానే నానబెట్టాలి
చియా విత్తనాలను నానబెడితే బాగా ఉబ్బుతాయి. చియా విత్తనాలు నానబెబ్టకుండా అసలే తినకూడదు. వీటిని తినాలనుకునే వారు చియా గింజలను 1 నుంచి 2 గంటలు బాగా నానబెట్టండి. వీటిని తినడానికి ముందు రాత్రంతా నానబెట్టండి. దీనివల్ల ఈ గింజలు వాటి సైజు కంటే చాలా ఎక్కువ ఉబ్బుతాయి.
వ్యాయామం కూడా అవసరమే
చియా గింజలు ఒక్కటే అదనపు కిలోలు తగ్గడానికి సహాయపడవు. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే మాత్రం రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. అప్పుడే మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కూడా మీరు చురుగ్గా, ఫిట్ గా ఉంటారు. జస్ట్ చియా విత్తనాలను తీసుకుంటే మాత్రమే బరువు తగ్గరని గుర్తుంచుకోండి. జాగింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలను చేయండి.
చియా సీడ్ రెసిపీ
బరువు తగ్గించుకోవాలనుకుంటే చియా సీడ్ రెసిపీని తయారుచేసుకుని తినండి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఎలా తయారుచేయాలంటే.. ఒక గిన్నె పాలను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల చియా గింజలను నానబెట్టండి. దీనిని రిఫ్రిజిరేటర్ లో పెట్టండి. దీనిని ఉదయం ఉదయం పూట తినేటప్పుడు తేనె, తరిగిన అరటిపండును, నచ్చిన ఇతర పండ్లను మిక్స్ చేయండి. కావాలనుకుకంటే చక్కెరను కూడా కలిపి తీసుకోండి. అయితే దీనిని 2 నుంచి 3 గంటలు రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి.