చలికాలంలో రోగాలెక్కువొస్తయ్.. రోగ నిరోధక శక్తిని పెంచే ఈ ఆహారాలను తప్పకుండా తినండి..

First Published | Oct 31, 2022, 9:50 AM IST

చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం తో పాటుగా ఎన్నో రోగాలు, అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇవేవి రాకూడదంటే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను ఎక్కువగా తినాలి. 
 

చలికాలం వచ్చేసింది. రోజు రోజుకు చలి విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి తోడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందులోనూ కరోనా ఇంకా పూర్తిగా వదిలిపోలేదు. దీని లక్షణాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. ఇలాంటి సమస్యలేమీ రాకూడదంటే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను ఎక్కువగా తినాలి. 
 

శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే ఎలాంటి రోగాలైనా తొందరగా తగ్గిపోతాయి. అలాగే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. కొన్ని రకాల కూరగాయలు, పండ్లు ఇమ్యూనిటీని పవర్ ను పెంచి మనల్ని ఫిట్ గా ఉంచుతాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటే పోషకం. ఈ పోషకం ఏయే కూరగాయలు, పండ్లలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos


నారింజ పండు

విటమిన్ పుష్కలంగా  ఉండే పండ్లలలో నారింజ ఒకటి. 100 గ్రాముల నారింజలో 53.2 మి.గ్రామ విటమిన్ సి ఉంటుంది. ఇది కణాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది. అలాగే కాల్లాజెన్ ను పెంచుతుంది. చర్మం కాంతివంతంగా మెరిపోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది మన శరీర ప్రధాన రక్షణ వ్యవస్థ అయిన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
 

బ్రోకలీ

బ్రోకలీలో ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. 100 గ్రాముల బ్రోకలీలో 89.2 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. అరకప్పు ఆవిరి బ్రోకలి నుంచి విటమిన్ సి కోసం 57 శాతం డివిని అందుతుంది. అంతేకాదు దీనిలో ఫైబర్, పొటాషియం, ప్రోటీన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

క్యాప్సికం

క్యాప్సికం లో కూడా విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన డైట్ అనే చెప్పాలి. పసుపు, ఎర్రని క్యాప్సికం ల కంటే ఆకుపచ్చని క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణసమస్యలను తొలగిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

Kale

కాలె

ఇతర కూరగాయల కంటే కాలెలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఇది ప్రపంచంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉత్తమ వనరుల్లో ఒకటి. 100 గ్రాముల కాలెలో 120 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఈ వెజ్జీలో  విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. 
 

స్ట్రాబెర్రీలు

ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటీస్, క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాల ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడతాయి. కప్పు స్ట్రాబెర్రీల్లో దాదాపుగా 90 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇది మెగ్నీషియం, భాస్వరాల భాండాగారం. 
 

టొమాటోలు

టమాటాల్లో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నప్పటికీ.. దీనిలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఒక మీడియం సైజు టామాటోను తీసుకుంటే ఆర్డిఐ లో సుమారు 28 శాతం అందుతుంది. దీనిలో విటమిన్ బి, విటమిన్ ఇ, పొటాషియంతో పాటుగా ఇతర పోషకాలు ఉంటాయి. దీన్ని కూరల్లోనే కాదు పచ్చిగా కూడా తినొచ్చు. 
 

click me!