బీట్ రూట్ అందానికి కాదు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్లు, ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. బీట్ రూట్ ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..