బరువు తగ్గాలనుకునే వారు ఆయిలీ ఫుడ్ ను తినకూడదు. అలాగే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ జోలికి అసలే వెల్లకూడదు. ఇవి మీ బరువును అమాంతం పెంచేస్తాయి. బరువు తగ్గడానికి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. తినడానికి గంట ముందు నీళ్లను బాగా తాగండి. నీళ్లను తాగడం వల్ల మీరు ఫుడ్ ను ఎక్కువగా తినలేరు. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను ఎక్కువగా తినండి. ఇవి కూడా మీ బరువును తగ్గించి.. బరువు తగ్గేందుకు సహాయపడతాయి.