కొత్తిమీర గింజల ఇతర ప్రయోజనాలు
ధనియాలు పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ గింజలు మలబద్దకం, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు ఈ గింజలు జీర్ణక్రియను కూడా మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ధనియాల్లో ఉండే పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ గింజలు ఆహారాన్ని సులువుగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.