ఈ పానీయాలు జీవక్రియను పెంచి, మొండి కొవ్వును వేగంగా కరిగిస్తాయి తెలుసా..?

First Published Jan 8, 2023, 5:06 PM IST

కొంతమంది జన్యుపరంగా అధిక జీవక్రియను కలిగి ఉంటారు. కానీ మరికొంతమందికి అలా ఉండదు. నిజానికి జీవక్రియ వేగంగా ఉంటేనే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. కొవ్వును వేగంగా కరిగించగలుగుతారు. 
 

బరువు తగ్గడం అంత సులువు కాదన్న ముచ్చట అందరికీ ఎరుకే. నిజంగా బరువు తగ్గడం సవాలుతో కూడుకున్నది. బరువు తగ్గడానికి హార్డ్ వర్క్, అంకితభావం చాలా చాలా అవసరం. అదనపు కిలోలు తగ్గడానికి సమతుల్య ఆహారం బాగా సహాయపడుతుంది. అలాగే వేగంగా బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. అయినప్పటికీ.. బరువును తగ్గించడానిక గొప్ప పాత్ర పోషిస్తున్న మరొక అంశం మీ జీవక్రియ. మీ జీవక్రియ ఎంత వేగంగా ఉంటే.. మీరు బరువు తగ్గడం అంత సులభం అవుతుంది. కొంతమంది జన్యుపరంగా అధిక జీవక్రియను కలిగి ఉంటారు. అందరికీ ఇలా ఉండదు. మీ జీవక్రియను పెంచడానికి, సహజంగా కొవ్వును కాల్చడానికి మీకు కొన్ని పానీయాలు బాగా సహాయపడతాయి. అవేంటంటే..

లెమన్ డిటాక్స్ వాటర్ 

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉత్తమ వనరులలో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇవి సిట్రిక్ యాసిడ్ ను కూడా కలిగి ఉంటాయి. నిమ్మకాయ  మన శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచడానికి ఈ డిటాక్స్ నీటికి కీరదోసకాయను చేర్చండి. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. లెమన్ డిటాక్స్ వాటర్ మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

సోంపు టీ

సోంపు గింజలు జీర్ణక్రియకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సోంపు గింజల్లో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం నుంచి బయటపడటానికి ఈ ఫెన్నెల్ టీ మీకు బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఈ టీ మీ జీవక్రియను పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కావాలనుకుంటే మీరు ఈ టీకి కొంత అల్లాన్ని కూడా జోడించండి. 
 

ఉసిరి జ్యూస్

ఉసిరికాయలో ఎన్నో గొప్ప ఔషదగుణాలు ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఉసిరి జీవక్రియ, జీర్ణక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉసిరిలో ఉండే ఆల్కలీన్ స్వభావం జీర్ణవ్యవస్థను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే  గట్ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. అలాగే జీవక్రియను సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

వాము డిటాక్స్ వాటర్

జీవక్రియను పెంచడానికి మరొక గొప్ప పానీయం ఈ అజ్వైన్ డిటాక్స్ వాటర్. వాములో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని ఆయుర్వేదంలో ఎన్నో మందుల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. వాము జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంద. ముఖ్యంగా ఇది మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

టమోటా జ్యూస్

టమాటా ప్రతి భారతీయ వంటగదులో ఉపయోగించే అత్యంత సాధారణ కూరగాయలలో ఒకటి. అయితే టమాటాలు రుచికి మాత్రమే మంచివని అనుకుంటారు. మీకు తెలుసా.. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. టమాటాల్లో లైకోపీన్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారు రోజూ గ్లాస్ టమాటా జ్యూస్ ను తాగితే మంచి ఫలితాలను పొందుతారు. 

click me!