మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను తప్పక తినండి

First Published Sep 16, 2022, 4:03 PM IST

మన చర్మమే మన ఆరోగ్యం ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. కానీ మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు, బ్లాక్ హెడ్స్, పిగ్మెంటేషన్ వంటి రూపంలో ట్యాక్సిన్స్ చర్మం నుంచి విడుదల అవుతాయి. అసలు ఈ చర్మ సమస్యలు ఎందుకు వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా..? 
 

మన శరీరం ప్రతీ నిమిషం ఎన్నో రసాయనిక మార్పలకు లోనవుతూనే ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియకు ఏదైనా అంతరాయం కలిగితే విషతుల్యాలు విడుదల అవుతాయి. దీని ఎఫెక్ట్ చర్మంపై కనిపిస్తుంది. అంటే దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. 

నిజానికి మన గట్ ఆరోగ్యానికి.. చర్మ ఆరోగ్యానికి  సంబంధం ఉంటుంది. అంటే గట్ ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. జీవక్రయ కూడా మెరుగుపడుతుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా సహజంగా మెరిసేలా చేస్తాయి. 

రంగురంగుల పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి టేస్టీగా ఉండటమే కాదు.. వీటిలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మపోషకాలు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి గట్ ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అన్నిరకాల పండ్లు దాదాపుగా ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్, ఎంజైమ్ల గట్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీంతో రక్తప్రవాహంలో పోషకాలు సరిగ్గా శోషించుకుంటాయి. అయితే చర్మాన్ని ఏ పండ్లు ఆరోగ్యంగా, అందంగా చేస్తాయో తెలుసుకుందాం పండి.. 
 

papaya

బొప్పాయి

బొప్పాయి పండ్లు ఏ సీజన్ లో అయినా అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లు మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా ఈ పండ్లను తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  దీనిలో పుష్కలంగా ఉండే పపైన్ పిగ్మెంటేషన్, డ్రై స్కిన్  సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పండు ముడతలను, వృద్ధాప్యం సంకేతాలను కూడా తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి లు సన్ టాన్ ను తొలగించడానికి సహాయపడతాయి. అలాగే స్కిన్ టోన్ ను ప్రకాశవంతంగా చేస్తుంది. 

చర్మం, గట్ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ చిన్న ముక్క బొప్పాయిని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్న బొప్పాయి ముక్కను గుజ్జుగా చేసి ముఖానికి అప్లై చేసి.. పది నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే ముఖం రీఫ్రెష్ గా మారడమే కాదు.. మెరిసిపోతుంది కూడా.

పుచ్చకాయ

ఎండాకాలంలో పక్కాగా పుచ్చకాయను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. మొత్తంగా ఈ పండును తింటే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. వడదెబ్బ తగిలే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ హానికరమైన సూర్యకిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. 

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొద్దిగా పుచ్చకాయను తినండి. పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్ది సేపు ఫ్రిజ్ లో పెట్టి ముఖంపై రుద్దడం వల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి వదిలిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా మారిపోతుంది. 
 

banana

అరటిపండ్లు

అరటిపండ్లలో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి12, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. అరటిలో ఉండే సహజసిద్దమైన నూనెలు సోరియాసిస్, తమర వంటి చర్మ సమస్యలను నయం చేయడానికి సహాయపడతాయి. అరటిలో పుష్కలంగా ఉండే బయోటిన్ కణవిభజన ప్రక్రియను పెంచుతుంది. దీంతో మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. 

రోజూ ఒక అరటిపండును తింటే చర్మ ఆరోగ్యం ఉంటుంది. గట్ పనితీరు మెరుగుపడుతుంది. 

pineapple

పైనాపిల్

పైనాపిల్ లో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే శక్తివంతమైన ఎంజైమ్ బ్రోమెలైన్ కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్ చనిపోయిన చర్మకణాలను తొలగిస్తుంది. అలాగే చర్మ వాపును కూడా తగ్గిస్తుంది. దీంతో కణ పునరుత్పత్తి ప్రక్రియ మొదలవుతుంది. మొత్తంగా ఈ పండు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని నుంచి ఇమ్యూనిటీని పెంచే విటమిన్ సిని పొందాలంటే పండిన పైనాపిల్ న తినండి. 

ఫైనల్ గా అన్ని రకాల పండ్లు కూడా చర్మానికి మేలు చేస్తాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అందుకే ప్రతిరోజూ మీ పళ్లెంలో రెండు వేర్వేరు పండ్లు ఉండేట్టు చూసుకోండి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ను ఒకదాన్నైనా రోజూ తినండి. 

click me!