పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్ టైమ్ టేబుల్ ఫాలో అవ్వాల్సిందే!

First Published Sep 16, 2022, 2:52 PM IST

ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు పిల్లలను వెంటాడుతూ ఉన్నాయి.
 

ఈ విధంగా పిల్లలు పోషకాహార లోపంతో ఎంతో బలహీనంగా తయారవుతున్నారు. అయితే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ టైం టేబుల్ పాటించాల్సిందే. మరి ఏ సమయంలో ఏ ఫుడ్ తినిపించాలో ఇక్కడ తెలుసుకుందాం..
 

ప్రతిరోజు పిల్లలకు సరైన సమయానికి సరైన ఆహారం ఇవ్వడం ఎంతో ముఖ్యం అయితే పిల్లలు తీసుకునే ఆహారం కడుపునిండటమే కాకుండా వారికి సరైన పోషకాలను అందించేదై ఉండాలి.ఇలా పోషక విలువలతో కూడినటువంటి ఆహార పదార్థాలను సరైన సమయానికి క్రమం తప్పకుండా ఇవ్వటం వల్ల పిల్లలు ఎంతో దృఢంగా ఉండటమే కాకుండా మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది.
 

ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా పాలు తాపించాలి. పాలతో పాటు నానబెట్టిన రెండు బాదం పప్పులు ఇవ్వాలి.ఉదయం ఎనిమిది గంటలకు చట్నీ సాంబార్ తో ఇడ్లీ లేదా ఎగ్ దోస పిల్లలకు అల్పాహారంగా తినిపించాలి. అలాగే 11 గంటల సమయంలో తప్పనిసరిగా ఏదో ఒక పండు తినిపించాలి.

మధ్యాహ్నం ఒంటిగంటకు పప్పు నెయ్యి అన్నం తప్పనిసరిగా తినిపించాలి. అనంతరం పెరుగు అన్నం కూడా తినిపించాలి.మధ్యాహ్నం మూడు గంటలకు నువ్వులు లేదా పల్లి బర్ఫీ తప్పనిసరిగా పెట్టాలి. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు మరేదైనా పండు తినిపించాలి.సాయంత్రం ఏడు గంటలకు రాజ్మా లేదా వెజిటేబుల్ కర్రీతో చపాతీలు తినిపించాలి. ఇక రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ పాలతో పాటు రెండు ఖర్జూరాలు తినిపించాలి.

ఈ విధంగా పిల్లలకు ప్రతిరోజు ఈ డైట్ ఫాలో అవుతూ ఆహారం తినిపించడం వల్ల వారికి కావలసినటువంటి పోషక విలువలు అందడమే కాకుండా పిల్లల ఎదుగుదల లో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయి.పిల్లలలో కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. ఇలా తరచూ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తినిపించడంతో పిల్లల మెదడు ఎదుగుదలకు తోడ్పడి మేధాశక్తి పెంపొందుతుంది.

click me!