శారీరక శ్రమ లేకపోవడం
కొంతమంది రెస్ట్ లేకుండా పనిచేస్తే.. ఇంకొంత మంది ఎప్పుడూ రెస్ట్ లోనే ఉంటారు. మీకు తెలుసా.. విశ్రాంతి ఎక్కువైనా డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం లేదా పడుకోవడం వంటివి ఒంటికి అంత మంచివి కావు. శారీరక శ్రమ లేకపోతే గుండె పోటు, గుండె జబ్బుల, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజంతా ఎక్కువ సేపు కూర్చునే వారికే క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అందుకే కూర్చుని పనిచేసే వారు ఇంట్లో ఉండే వారు సీటుపై నుంచి లేచి కాసేపు అటూ ఇటూ నడుస్తూ ఉండండి.