Hair Curling: కర్లీ హెయిర్ కావాలా? ఈ చవకైనా హెయిర్ యాక్సెసరీస్ కొని వాడండి

Published : Jun 08, 2026, 10:54 AM IST

Hair Curling: ఉంగరాల జుట్టు అంటే ఎంతో మందికి ఇష్టం. జుట్టును కర్లింగ్ చేయించుకోవడానికి పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.  ఇంట్లోనే కర్ల్ చేసుకోవచ్చు. వేడి లేకుండా జుట్టును కర్ల్ చేసే యాక్సెసరీలు గురించి ఇక్కడ ఇచ్చాము.

PREV
15
ఆటోమేటిక్ హెయిర్ కర్లర్

ఇది ఆటోమేటిక్ హెయిర్ కర్లర్. మార్కెట్లో సులువుగా దొరుకుతుంది. ఆన్ లైన్లో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు.  జుట్టును దానంతట అదే రోల్ చేసి, కొన్ని సెకన్లలోనే కర్లీగా మార్చేస్తుంది. దీన్ని వాడడం చాలా సులువు. మార్కెట్లో దీని ధర రూ.2,000 నుంచి  మొదలవుతుంది.

25
కర్లింగ్ ఐరన్

కర్లింగ్ ఐరన్ ఎంతో మంది అమ్మాయిలు వాడుతున్నారు.  హెయిర్ స్టైలింగ్ గ్యాడ్జెట్లలో ఇది ఒకటి. వేర్వేరు సైజుల్లో ఇది లభిస్తుంది.  ఇది సాఫ్ట్ వేవ్స్ నుంచి టైట్ కర్ల్స్ వరకు చేయడానికి వాడవచ్చు. దీని ధర రూ.800 నుంచి మొదలవుతుంది.

35
ఫ్లెక్సీ హెయిర్ రోలర్స్

ఫ్లెక్సీ రోలర్స్‌ను మీరు చూసే ఉంటారు. వీటిని జుట్టుకు చుట్టి కొన్ని గంటల పాటు వదిలేస్తే చాలు అందమైన కర్ల్స్ వస్తాయి. వీటి ధర కేవలం రూ.150 నుంచి రూ.700 వరకు ఉంటుంది. జుట్టును పాయలుగా విడదీసుకుని వీటిని చుట్టాలి. తరువాత మడతపెట్టి ఉంచాలి. వీటిని వాడడం చాలా సులువు.

45
హీట్‌లెస్ కర్లింగ్ రిబ్బన్

హీట్‌లెస్ కర్లింగ్ రిబ్బన్ కూడా మార్కెట్లో దొరుకుతోంది. రాత్రిపూట దీన్ని పెట్టుకుని పడుకుంటే, ఉదయానికి నేచురల్ కర్ల్స్ వస్తాయి. దీని ధర రూ.200 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. జుట్టు డ్యామేజ్ కాకుండా అందమైన కర్ల్స్ వస్తాయి.

55
హాట్ రోలర్స్ సెట్

హాట్ రోలర్స్ జుట్టుకు కర్ల్స్ బాగా ఇస్తాయని అంటారు. ముఖ్యంగా పొడవాటి, దట్టమైన జుట్టుపై ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. చాలా మంది సెలబ్రిటీలఈ హాట్ రోలర్స్‌ను ఉపయోగిస్తారు. దీని ధర రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories