Blouse Designs: సాదా చీరతోనూ అదిరిపోయే లుక్ కావాలా? ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ వేసుకోండి

Published : May 14, 2026, 11:29 AM IST

Blouse Designs: చీరలో అందంగా, హుందాగా కనిపిస్తారు. చీరకు తగ్గ బ్లౌజ్ వేస్తే ఆ అందం రెండింతలు అవుతుంది. దానికోసం ప్రతీసారి కొత్త చీరలు కొనాల్సిన పనిలేదు. మీ దగ్గర ఉన్న పాత చీరలతోనే కొత్తగా మెరిసిపోవచ్చు. దాని కోసం అదిరిపోయే బ్లౌజ్ ఎంచుకోవాలి.

PREV
15
హై-నెక్ విత్ ఎల్బో లెంత్

కాటన్ చీర కట్టినా, సిల్క్ చీర కట్టినా హై-నెక్, మోచేతుల వరకు చేతులున్న బ్లౌజ్ వేసుకుంటే బావుంటుంది. మీకు మంచి 'రాయల్' లుక్ వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ వేసుకుంటే మెడలో నెక్లెస్ అవసరం లేదు, పెద్ద కమ్మలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి తయారై చూడండి.. ఎంతో కొత్తగా, హూందాగా కనిపిస్తారు.

25
కాంట్రాస్ట్ మ్యాజిక్

చీర ఏ రంగులో ఉందో అదే రంగులో బ్లౌజ్ కుట్టించుకుంటే ఆకర్షణగా ఉండదు. చీర రంగుకు పూర్తి భిన్నమైన కాంట్రాస్ట్ రంగును ఎంచుకోవాలి. ఉదాహరణకు మెరూన్ రంగు చీరకు ఎమరాల్డ్ గ్రీన్ (Emerald Green) లేదా నలుపు రంగు బ్లౌజ్ వేసుకుంటే ఆ అందమే వేరు. ఎంత మందిలో ఉన్నా మీరు  ప్రత్యేకంగా కనిపిస్తారు.

35
మినిమలిస్ట్ వర్క్

బ్లౌజ్ నిండా వర్క్ చేయించకుండా, కేవలం చేతుల అంచుల వద్ద, మెడ దగ్గర మాత్రమే సన్నగా గోల్డెన్ లేదా యాంటిక్ వర్క్ చేయిస్తే క్లాసిక్ లుక్ వస్తుంది. దీనిపై బ్లౌజ్ రంగుకు కాంట్రాస్ట్ గా ఉండే చీర కడితే అందరి కళ్లూ మీ వైపే ఉంటాయి.

45
వింటేజ్ కాలర్ బ్లౌజ్

షర్ట్ కాలర్ లేదా స్టాండ్ కాలర్ బ్లౌజ్‌లు ఇప్పుడు యువతలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి మీకు ఒక 'కార్పొరేట్ రాయల్టీ' లుక్‌ను ఇస్తాయి. మామూలు బార్డర్ లేని చీరలకు ఇలాంటి బ్లౌజ్ లు మంచి ఎంపిక అని చెప్పుకోవాలి.

55
బ్యాక్ డిజైన్ రహస్యం

బ్లౌజ్ ముందు భాగం సింపుల్‌గా ఉన్నా..  వెనుక వైపు లోతైన 'V' లేదా చతురస్రాకారంలో డిజైన్ పెట్టి, దానికి ఒక పెద్ద వేలాడే తాళ్లు లేదా బార్డర్ జతచేస్తే చాలు… ఆ బ్లౌజ్ కు అదిరిపోయే లుక్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ పీస్ లను ఇలా కుట్టిస్తే కొత్తగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories