AC Bill Tips : రోజంతా ఏసీ వాడినా కరెంట్ బిల్ తక్కువగా రావాలా..? ఈ సీక్రెట్ టిప్స్ మీకోసమే..!

Published : May 14, 2026, 11:01 AM ISTUpdated : May 14, 2026, 11:07 AM IST

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి, ఉక్కపోతను తట్టుకోలేక పగలూ, రాత్రి ఏసీ వాడుతున్నారా..? అయితే ఈసారి కరెంట్ బిల్లు చూసి కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. కానీ కొన్ని స్మార్ట్ ఐడియాస్ పాటిస్తే ఏసీ ఎంతవాడినా మీ కరెంట్ బిల్ అదుపులో ఉంటుంది. అవేంటో చూద్దాం. 

PREV
17
ఏసీని ఎలా వాడితే కరెంట్ బిల్లు తగ్గించొచ్చు..?

AC Usage Tips : ''ఇవేం ఎండల్రా బాబు... సూరీడు ఇలా తగులుకున్నాడేంటి..!''... ఇదీ ప్రస్తుతం తెలుగు ప్రజల అభిప్రాయం. బయటకు వెళదామంటే ఎండలు... ఇంట్లో ఉందామంటే ఉక్కపోత... ఏసీ వాడదామంటే కరెంట్ బిల్లు భయం... ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అయితే ఈ ఎండల నుండి ఉపశమనం కోసం రోజంతా ఏసీ వాడినా కరెంట్ బిల్లు తక్కువగానే రావాలంటే కొన్ని స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

27
1. ఏసి టెంపరేచర్ ఎంత ఉండాలి..?

చాలామంది ఏసి టెంపరేచర్ 16°C లేదా 18°C లో పెడితే గది తొందరగా చల్లబడుతుందని అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఏసీని 24°C నుంచి 26°C మధ్య ఉంచడమే మన శరీరానికి, మన జేబుకు కూడా మంచిది. టెంపరేచర్ ఒక డిగ్రీ పెంచిన ప్రతిసారీ 6% కరెంట్ ఆదా అవుతుంది... తగ్గిస్తే కరెంట్ వాడకం పెరుగుతుంది, బిల్లు వాచిపోతుంది. 

37
2. ఫ్యాన్ + ఏసీ కాంబినేషన్

ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో వాడండి. ఇది ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలిని గది నలుమూలలకూ సమానంగా పంపిణీ చేస్తుంది. దీనివల్ల గది మొత్తం త్వరగా చల్లబడుతుంది... ఏసీ కంప్రెసర్‌పై భారం తగ్గుతుంది. అంటే కరెంట్ బిల్లు తగ్గినట్లే. 

47
3 .వేడిని గదిలోకి రానీయకండి

కిటికీలు, డోర్ల నుంచి సూర్యరశ్మి నేరుగా గదిలోకి వస్తే ఏసీ ఎంత పనిచేసినా గదిని చల్లబరచడం కష్టం. అందుకే దళసరి కర్టెన్లు లేదా హీట్ రిఫ్లెక్టివ్ ఫిల్మ్‌లు వాడితే గదిలోని వేడిని 30% వరకు తగ్గించవచ్చు. దీంతో ఏసీపై ఒత్తిడి తగ్గి కరెంట్ ఆదా అవుతుంది.

57
4. ఫిల్టర్ క్లీన్... బిల్ డౌన్..!

ఏసీని ఎంతబాగా మెయింటేన్ చేస్తే దాని పనితీరు అంత బాగుంటుంది. ముఖ్యంగా ఏసీ ఫిల్టర్‌ ను క్లీన్ గా ఉంచుకోవాలి... అందులో దుమ్ము చేరితే గాలిని బయటకు పంపడానికి ఏసీ ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. దీనివల్ల కరెంట్ వాడకం పెరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మీరే ఫిల్టర్‌ను తీసి, నీటితో కడిగి తిరిగి అమర్చితే సరిపోతుంది. ప్రతి సంవత్సరం వేసవి ఆరంభంలో ఏసిని సర్వీస్ చేయించాలి. 

67
5. డోర్ గ్యాప్స్ సరిచూసుకోండి

గది తలుపులు లేదా కిటికీల సందుల నుంచి చల్లటి గాలి బయటకు పోతోందా..? చిన్న గ్యాప్ ఉన్నా సరే, అది మీ కరెంట్ బిల్‌కు పెద్ద చిల్లు పెడుతుంది. డోర్ సీల్స్ లేదా గుడ్డలతో ఆ ఖాళీలను మూసేయండి. దీంతో చల్లని గాలి గదిలోనే సర్క్యులేట్ అవుతుంది.

77
6. స్లీప్ మోడ్ (Sleep Mode)

రాత్రి నిద్రపోయేటప్పుడు ఏసీలో 'స్లీప్ మోడ్' ఆన్ చేయండి. ఇది ప్రతి గంటకు ఉష్ణోగ్రతను కొద్దికొద్దిగా పెంచుతుంది. దీనివల్ల తెల్లవారుజామున ఏసీ అనవసరంగా పనిచేయడం ఆగిపోతుంది… కరెంట్ ఆదా అవుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories