వాకింగ్ ఉదయమే చేయాలా..? సాయంత్రం చేయకూడదా..?

First Published Aug 1, 2022, 5:03 PM IST

వాకింగ్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అందుకే చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. ఇందులో కొంతమంది ఉదయం వాకింగ్ చేస్తే.. ఇంకొంత మంది మాత్రం సాయంత్రం వేళల్లో చేస్తుంటారు. 

walking

క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల శరీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. అందుకే చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. అయితే కొంతమంది ఉదయం పూట వాకింగ్ చేస్తే మరికొంత మంది టైం లేక సాయంత్రం పూట వాకింగ్ చేస్తుంటారు. రోజుకు అరగంట నడిచినా ఊబకాయం నుంచి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 

అయితే కొంతమందిలో వాకింగ్ గురించి ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. అవేంటంటే వాకింగ్ ఉదయమే చేయాలా..? మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ టైం చేయకూడదా..? అని డౌట్లు కలుగుతాయి. మరి దీనికి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

walking

వాకింగ్ ఉదయం పూట చేస్తే ఏమౌతుంది

ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల బాడీ హుషారుగా ఉంటుంది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఉదయం వాకింగ్ చేయడం వల్ల సూర్య రశ్మి ద్వారా శరీరానికి డి విటమిన్ కూడా లభిస్తుంది. అంతేకాదు మార్నింగ్ వాకింగ్  తో జీవగడియారం సక్రమంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

morning walking

ఉదయం వాకింగ్ చేయాలని త్వరగా లేస్తారు. దీంతో మీరు నైట్ టైం తొందరగా నిద్రపోతారు. దీనివల్ల మీకు కంటినిండా నిద్ర ఉంటుంది. ఇది జీవగడియారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు ఉదయం పూట వెదర్ కూడా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ కూడా అందుతుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల మనస్సు రీఫ్రెష్ గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. 
 

morning walking

ఎప్పుడైనా వాకింగ్ చేయొచ్చు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.. వాకింగ్ ఉదయమే చేయాలన్న రూలేమీ లేదు. ఎప్పుడైనా నడవొచ్చు. శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే మీకు వీలున్నప్పుడల్లా 30 నిమిషాల పాటు చెమట పట్టేలా నడవాలని నిపుణులు చెబుతున్నారు. మెల్లగా నడవడం కంటే బాడీ మొత్తం కదిలేలా నడిస్తేనే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. చేతులు మొత్తం ఊగేలా ఫాస్ట్ గా నడవాలి.
 

ఇలా నడిస్తేనే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదం తగ్గుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఊబకాయం సమస్య నుంచి కూడా తొందరగా బయటపడతారు. 
 

వేగంగా బాడీ మొత్తం కదిలేలా నడిచే వారు హార్ట్ స్ట్రోక్ బారిన పడే ప్రమాదం చాలా తక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

అయితే వాకింగ్ కాకుండా ఇతర వ్యాయామాలు చేయడానికి.. వాటికంటూ ఓ సమయాన్ని కేటాయించాలి. ఆ సమయంలోనే వాటిని చేయాల్సి ఉంటుంది. నడకకు మాత్రం ఇలాంటి రూల్సేమీ లేవని నిపుణులు చెబుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ అంటూ తేడా లేకుండా.. రోజుకు రెండు మూడు సార్లైనా నడవాలని చెబుతున్నారు. మొత్తంగా ఈ రోజుల్లో నడక లేకపోతే ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం ఉంది. 

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తిన్న తర్వాత నడిస్తే పొట్ట వచ్చే అవకాశం ఉంది. అందుకే తిన్న తర్వాత వెంటనే నడవకుండా పది నిమిషాలైనా రెస్ట్ తీసుకుని నడవండి. 

click me!