మీ జుట్టు పల్చగా ఉంటే, లేయరింగ్ హెయిర్ స్టైల్ ప్రయత్నించండి. లేయర్స్ కట్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది.
మీ జుట్టు పల్చగా ఉండి, జడ వేసుకోవాలనుకుంటే, హై పోనీటెయిల్ వేసి మధ్యలో డోనట్ బన్ పెట్టండి. దాని చుట్టూ మీ జుట్టును ఒత్తుగా కనిపించేలా స్టైలిష్ హెయిర్ బన్ వేసుకోండి.
కర్ల్స్ చేయడం వల్ల జుట్టు ఉబ్బినట్టుగా, ఒత్తుగా కనిపిస్తుంది. మీ జుట్టుకు ఇలా సాఫ్ట్ కర్ల్స్ చేసి ఓపెన్‌గా వదిలేయండి.
మీకు పొడవాటి జుట్టు ఇష్టం లేకపోతే, ఇలా పిక్సీ కట్ హెయిర్ స్టైల్ కూడా ట్రై చేయొచ్చు. ఇది జుట్టుకు ఒత్తుదనాన్ని ఇస్తుంది, చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
మోడ్రన్, ట్రెండీ లుక్ కోసం పల్చటి జుట్టు ఉన్న అమ్మాయిలు ఇన్వర్టెడ్ బాబ్ హెయిర్‌స్టైల్ కూడా చేసుకోవచ్చు. ఇందులో వెనుక జుట్టుకు స్టెప్స్, ముందు వైపు బ్యాంగ్స్ హెయిర్ స్టైల్ ఉంటుంది.
పల్చటి జుట్టును ఒత్తుగా చూపించడానికి మీ జుట్టును రెండు భాగాలుగా విభజించండి. పై భాగంలో చిన్న బన్ వేసి, కింద జుట్టును వదిలేసి సాఫ్ట్ కర్ల్స్ చేసుకోండి.