డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు రాకూడదంటే.. ఈ జాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సిందే..

Published : Aug 01, 2022, 04:10 PM IST

ఇతర కాలాలతో పోల్చితే వానాకాలంలోనే ఎన్నో ప్రమాదకరమైన రోగాలు సోకే ప్రమాదం ఉంది. అందుకే ఈ రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవాలి. 

PREV
16
డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు రాకూడదంటే.. ఈ జాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సిందే..

వర్షాకాలంలో వచ్చే చిరు జల్లుల్లు మనస్సుకు హాయిని కలిగించినా.. ఈ సీజన్ లో వచ్చే రోగాలు మాత్రం ప్రాణాంతకమనే చెప్పాలి. ముఖ్యంగా ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. దోమలు కుడితే.. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి రోగాలు వస్తాయి. ఈ రోగాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలానే ఉన్నారు. కాబట్టి ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

26

దోమల రాకుండా చూసుకోవాలి

దోమ కాటు వల్లే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు వస్తాయి. అందుకే దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం ఇంట్లోకి దోమలు రాకుండా విండోలు క్లోజ్ చేయాలి. అయితే చాలా మంది ఈ దోమలు మురికిగా ఉండే ప్లేస్ లోనే జీవిస్తాయని అనుకుంటారు. నిజానికి డెంగ్యూను కలిగించే దోమలు మన ఇంట్లోని నీళ్లలోని పాత్రల్లో, ఏసీ, కూలర్ వాటర్ లో కూడా గుడ్లను పెడుతుంటాయి. అందుకే దోమలు రాకుండా ఎలాంటి అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. 
 

36

దోమ కాటును తేలిగ్గా తీసిపారేయకండి

ఎన్నో దోమలు కుడుతున్నాయి. రోజూ కుడుతున్నాయ్ కానీ నాకేం డెంగ్యూ రాలేదని ఆనంద పడిపోకండి. ఏడిస్ దోమ ఒక్కటి కుట్టినా మీరు డెంగ్యూ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఈ దోమ కాటు మయ డేంజర్.  అందుకే దోమల్ని తేలిగ్గా తీసిపారయేకండి. 
 

46

దోమల బారీ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి..

దోమలు ఇంట్లోకి రాకుండా నివారించినట్టైతే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ప్రమాదాన్ని మీరు  తప్పించుకున్నట్టే. ఎంత ట్రై చేసినా ఇంట్లో ఏదో ఒక చోట దోమలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు నిండుగా.. చేతులు పూర్తిగా కవర్ అయ్యే దుస్తులనే వేసుకోండి. Moscato coils ను యూజ్ చేసినా దోమల బెడద తప్పుతుంది. 
 

56

రెగ్యులర్ గా వ్యాయామం చేయండి

వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది.  రోజుకు అరగంట పాటు వ్యాయామం చేస్తే రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదండోయ్ ఎన్నో రోగాలు సైతం దూరమవుతాయి. అవును వ్యాయామం చేయడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. దీంతో ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం తప్పుతుంది. వానాకాలం అని వ్యాయామం చేయడానికి బయటకు వెళ్లని వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు ఇంట్లో ఉండి కూడా వ్యాయామం చేసుకోవచ్చు.

66

నిద్ర 

కంటి నిండా నిద్ర ఉంటేనే మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలాగే అధిక రక్తపోటు, డిప్రెషన్, నిద్రలేమి, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇవి ఎన్నో రోగాకలు దారితీస్తాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories