Health Tips: పరిగడుపున వీటిని తింటే మీరు డేంజర్ లో పడ్డట్టే.. జాగ్రత్త..

Published : Aug 01, 2022, 03:20 PM IST

Health Tips: ఒత్తిడితో కూడిన ఈ గజిబిజీ లైఫ్ లో ఆరోగ్యంగా ఉండాలంటే..ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులను తప్పకుండా చేసుకోవాలి.   

PREV
17
 Health Tips: పరిగడుపున వీటిని తింటే మీరు డేంజర్ లో పడ్డట్టే.. జాగ్రత్త..

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో కూడిన లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో మానసిక, శరీరక అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యల ముప్పు తప్పాలంటే ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైనవిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 
 

27

ముఖ్యంగా ఉదయం పరిగడుపున కొన్ని ఆహార పదార్థాలను అసలే తినకూడని నిపుణులు సలహానిస్తున్నారు. లేదంటే జీర్ణసమస్యలు వస్తాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ  ఖాళీ కడుపున ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37

పండ్ల రసాలు

పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది. కానీ వీటిని పరిగడుపున మాత్రం తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పండ్ల రసాలను పరిగడుపున తాగితే వాటిలో ఉండే ఫ్రక్టోజ్ కాలెయంపై చెడు ప్రభావం చూపెడుతుంది. అందుకే పండ్ల రసాలను పరిగడుపున అసలే తాగకూడదు.
 

47

టీ, కాఫీ

పరిగడుపు టీ గానీ, కాఫీ గాని తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే వీటిని తాగడం వల్ల హైడ్రోక్లోరిక్ యాడిస్ లెవెల్స్ పెరిగి పొట్టలో పుండ్లు ఏర్పడతాయి. 

57

పెరుగు

పెరుగు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినా.. దీన్ని పరిగడుపున ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. ఒకవేళ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పులిసిన పెరుగు వల్ల పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాల లెవెల్స్ పెరగుతాయి. ఇది ఎన్నో రోగాలకు కారణమవుతుంది. 

67

సలాడ్లు

పచ్చి కూరగాయలతో సలాడ్ ను తయారుచేస్తారు. ఈ సలాడ్లను మధ్యాహ్నం టైంలో తీసుకుంటే  ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. సలాడ్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని పరిగడుపున తాగితే కడుపునొప్పితో పాటుగా అపానవాయువు (పిత్తులు) వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.  

77

పుల్లని పండ్లు

సిట్రస్ పండ్లను కూడా పరిగడుపున తినకూడదు. ఎందుకంటే వీటివల్ల కడుపులో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో గ్యాస్ ప్రాబ్లం,  అల్సర్, పొట్టలో పుండ్లు ఏర్పడతాయి. అంతేకాదు ఈ పండ్లలో ఫ్రక్టోజ్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories