విటమిన్ ఎ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది
శరీరంలో అవసరానికి మించి విటమిన్ ఎ ఎక్కువగా ఉండే శరీరంపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. అవసరమైన దానికి కంటే విటమిన్ ఎ ను ఆహారాల ద్వారా తీసుకోవడం, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం వల్ల ఎముకలపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ఎక్కువగా కాలం విటమిన్ ఎ ను ఎక్కువగా తీసుకుంటే ఎముకలు పగుళ్లు వస్తాయి. వికారం, వాంతులు, తలనొప్పి, ఎదుగుదల నిలిచిపోవడం, హెయిర్ ఫాల్, పేలవమైన ఆకలి, దృష్టి సమస్యలు, సూర్యకాంతికి తట్టుకోలేకపోవడం, పొడి చర్మం, చర్మంపై దురద వంటి సమస్యలు కలుగుతాయి.