వర్షకాలంలో ఈ పండ్లను ఖచ్చితంగా తినండి.. అప్పుడే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది..

Published : Jul 09, 2022, 02:59 PM IST

వానాకాలంలో దగ్గు, వైరల్ ఫీవర్, జలుబు, జ్వరం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధులను నుంచి త్వరగా బయటపడాలన్నా.. వీటి బారిన పడకూడదన్నా.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. 

PREV
16
వర్షకాలంలో ఈ పండ్లను ఖచ్చితంగా తినండి.. అప్పుడే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది..
Fruits

కూల్ వెదర్ లో వేడి వేడి బజ్జీలో లేకపోతే.. సమోసాలనో.. వేడి వేడి టీ నో తాగితే అబ్బా ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా.. ఈ ఫీలింగ్ బాగానే అనిపించినా ఈ సీజన్ లో ఎన్నో అంటువ్యాధులు, ఇతర జబ్బులు సోకే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భంలో  స్ట్రీట్ ఫుడ్ తింటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడొచ్చు. ముఖ్యంగా ఈ సీజన్ లో దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్, జ్వరం వంటి ఎన్నో రోగాలు వస్తాయి. వీటి బారిన పడకూడదంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. ఇమ్యూనిటీ పెరగాలంటే బజ్జీలు, సమోసాలు కాకుండా కొన్ని పండ్లను ఎక్కువగా తినాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

నేరేడు పండ్లు

ఈ సీజన్ లో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడతాయి. ఈ పండ్లలో విటమిన్లు, ఫోలెట్, ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే బరువు పెరిగిపోతామన్న భయం కూడా ఉండదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫ్రూట్ అనే చెప్పాలి. దీనిలో ఉండే విటమన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా.. చర్మ సమస్యలను పోగొట్టి చర్మాన్నికాంతివంతంగా చేస్తుంది. నేరేడు పండ్లను అలాగే తిన్నా లేదంటే జ్యూస్ చేసుకుని తాగినా నీళ్ల వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండదు. అలాగే అల్సర్ సమస్య కూడా రాదు. 

36

యాపిల్ (Apple)

రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు పోవాల్సిన అవసరం ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వానాకాలంలో రోజుకో యాపిల్ పండును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ పండులలో విటమిన్ సి, పొటాషియం,  కాపర్ వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే అతిసారం, మలబద్దకం వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

46

దానిమ్మ (Pomegranate)

దానిమ్మ పండ్లు వార్షాకాలంలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అతేకాదు దీనిలో ఉండే ఔషద లక్షణాలు ఎన్నో రోగాలను, అంటువ్యాధులను అడ్డుకుంటాయి. దానిమ్మలో పాలీఫెనాల్స్ యాంటీ  ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. 

56

అల్ బుకర (Al Bukhara)

ఎర్రగా నిగనిగలాడే ఆల్ బుకరా పండ్లకు వర్షకాలంలో కొదవే ఉండదు. పుల్లగా ఉండే ఈ  పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ సీజన్ లో సాధారణంగా అయ్యే జలుబును తగ్గించేందుకు ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఈ పండు హైపర్ టెన్షన్ సమస్యను తగ్గించడంతో పాటుగా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. 
 

66

బొప్పాయి (papaya)

ఈ సీజన్ లో బొప్పాయిలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అలాగే సీజనల్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.  

Read more Photos on
click me!

Recommended Stories