గుమ్మడికాయ పాయసంతో ఎంత ఆరోగ్యమో తెలుసా.. ఇలా చేస్తే సూపర్ టెస్ట్!

Published : Jul 09, 2022, 03:49 PM IST

గుమ్మడికాయతో చేసుకునే కూరలు, స్వీట్లు చాలా రుచిగా ఉంటాయి. గుమ్మడికాయ నోటికి రుచిని అందించడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.  

PREV
16
గుమ్మడికాయ పాయసంతో ఎంత ఆరోగ్యమో తెలుసా.. ఇలా చేస్తే సూపర్ టెస్ట్!

గుమ్మడి, కొబ్బరి పాలు, బెల్లంతో చేసుకునే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇందులో చక్కెరకు బదులు బెల్లాన్ని ఉపయోగించడంతో ఆరోగ్యానికి మరిన్ని లాభాలు కలుగుతాయి. ఈ పాయసం తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం గుమ్మడికాయ పాయసం (Pumpkin Payasam) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

26

కావలసిన పదార్థాలు: పావు కిలో బాగా పండిన తీపి గుమ్మడికాయ (Sweet pampkin), సగం కప్పు పెసరపప్పు (Pesarapappu), పావు లీటర్ కొబ్బరి పాలు (Coconut milk), పావు కిలో బెల్లం (jaggery), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee), ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు (Cashew) పలుకులు, ఒక టేబుల్ స్పూన్ బాదం (Almond) తురుము, చిటికెడు యాలకుల పొడి (Cardamom powder).
 

36

తయారీ విధానం: ముందుగా పెసరపప్పును కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ముప్పావు లీటర్ నీళ్లు పోసి బాగా మరిగించాలి (Boil). నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా రెండు గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పును (Soaked  Pesarapappu) వేసి ఉడికించుకోవాలి. పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉడికించుకోవాలి.
 

46

పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు పైన ఏర్పడే తేటను తీసివేయాలి. పెసరపప్పు ఉడికిన తరువాత గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి (Cook well). గుమ్మడికాయ ముక్కలు, పెసరపప్పు ఉడికిన తరువాత పప్పు గిన్నెతో బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్న మిశ్రమాన్ని మరో ఐదు నిమిషాల పాటు   ఉడికించుకోవాలి. మిశ్రమం చిక్కబడ్డాక కొబ్బరి పాలు వేసి తక్కువ మంట (Low flame) మీద  ఉడికించుకోవాలి.
 

56

ఇప్పుడు స్టవ్ పై మరో గిన్నె పెట్టి అందులో బెల్లం, రెండు టేబుల్ స్పూన్ ల నీళ్లు పోసి మరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని (Jaggery caramel) పెసరపప్పు, గుమ్మడికాయ మిశ్రమంలో వేసి తక్కువ మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మిశ్రమమంతా బాగా ఉడికి చిక్కబడే సమయంలో నెయ్యి, జీడిపప్పు, బాదం పలుకులు,చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని (Mix well) స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
 

66

అంతే ఎంతో రుచికరమైన నోరూరించే గుమ్మడికాయ పాయసం రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పాయసం మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది. ఇందులో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగిస్తున్నాం కనుక ఆరోగ్యానికి మంచిది (Good for health) . ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి హెల్తీ రెసిపీ (Healthy recipe).

click me!

Recommended Stories