Wedding Temples: 30ఏళ్లు దాటినా పెళ్లి కాలేదని ఫీల్ అవుతున్నారా? ఈ గుడికి వెళ్లొస్తే నెలలో పెళ్లి గ్యారెంటీ

Published : Apr 27, 2026, 09:00 AM IST

 Wedding Temples: మీ వయసు 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాలేదని బాధపడుతున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వడం లేదా? అయితే.. ఈ గుళ్లకు వెళ్లి వస్తే.. నెల రోజుల్లో మీ పెళ్లి కాలేదన్న బాధ తీరిపోవడం ఖాయం.. 

PREV
13
పెళ్లి అడ్డంకులు తొలగించే ఆలయాలు..

జీవితంలో పెళ్లి ఒక భాగం. ప్రతి ఒక్కరూ ఒక వయసు వచ్చే సరికి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని అనుకుంటారు. అయితే.. ఈ రోజుల్లో చాలా మంది తమ వయసును పట్టించుకోకుండా కెరీర్ లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి ఊసు ఎత్తడం లేదు. తీరా ఫైనాన్షియల్ సెట్ అయ్యాం అనుకునే సరికి పెళ్లి వయసు దాటేస్తున్నారు. ఒక వయసు దాటిన తర్వాత కోరుకున్న వ్యక్తి దొరకడం కష్టం అనే చెప్పాలి. దీంతో వివాహం మరింత ఆలస్యం అవుతోంది. దీనికితోడు.. జాతకాల సమస్యతో కూడా కొందరికి పెళ్లి కావడం కష్టం అవుతోంది. అయితే.. ఏ కారణంతో మీకు పెళ్లి కాకపోయినా.. మన దేశంలోని కొన్ని ఆలయాలను దర్శిస్తే... ఆ సమస్య తీరిపోతుంది. వెంటనే పెళ్లి కుదురుతుంది. మరి.. ఏ గుడికి వెళ్తే పెళ్లి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

23
మంగళాదేవి ఆలయం...

మంగళూరులో ఉన్న పురాతన మంగళాదేవి ఆలయాన్ని సందర్శించి, అక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. వివాహం జరగకపోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వెంటనే వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం

ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయానికి ఒక్కసారి దర్శిస్తే చాలు.. ఆ శివయ్య ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకు.. పెళ్లికి సంబంధించిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి. వెంటనే వివాహం జరిగే అవకాశం ఉంది.జాతకంలో దోషాలు తొలగించే ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ చేస్తారు. అంతేకాదు ఈ ఆలయానికి వెళితే.. ఆర్థిక సమస్యలు కూడా తిరిగిపోతాయని భక్తులు నమ్ముతారు.

33
కిక్కేరి శ్రీ బ్రహ్మేశ్వర ఆలయం

మండ్య జిల్లాలోని కిక్కేరిలో ఉన్న ఈ పురాతన ఆలయం, తన అద్భుతమైన వాస్తుశిల్పానికి మాత్రమే కాకుండా, భక్తుల సమస్యలను పరిష్కరించే ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి దైవానికి ప్రత్యేక అభిషేకం చేయడం ద్వారా వివాహ ఆటంకాలు తొలగిపోయి, అందమైన వైవాహిక జీవితం లభిస్తుంది.

ఖాటు శ్యామ్ ఆలయం

రాజస్థాన్‌లో ఉన్న ఈ ఆలయం, తన భక్తుల కోరికలన్నింటినీ నెరవేర్చడంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనఃపూర్వకంగా ప్రార్థనలు చేయడం వల్ల వివాహానికి అడ్డువచ్చే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా, ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం వల్ల జాతకంలోని అన్ని జ్యోతిష్య దోషాలు తొలగిపోయి, త్వరగా వివాహం జరిగేందుకు మార్గం సుగమం అవుతుంది.

కామాఖ్య దేవాలయం

అస్సాంలోని గౌహతిలో ఉన్న ఈ శక్తి పీఠం ప్రేమ, వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పూజలు చేయడం వల్ల సంబంధాలలో సామరస్యం పెరిగి, త్వరగా వివాహం జరుగుతుంది.

మహాలక్ష్మి లేఅవుట్ ఇస్కాన్ దేవాలయం

బెంగళూరులోని ఈ అందమైన రాధా కృష్ణ ఆలయం దర్శనానికి మాత్రమే కాకుండా భక్తుల కష్టాలను తీర్చడంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాధాకృష్ణులకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం వల్ల వెంటనే వివాహాలు జరుగుతాయని నమ్ముతారు.

Read more Photos on
click me!

Recommended Stories