ఈ రెండు పదార్థాలను బాగా కలిపి, మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగాలకు ఫేస్ ప్యాక్‌లా బాగా పట్టించాలి. ఈ మిశ్రమంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మంచి ఫలితాలు రావాలంటే, ఈ ప్యాక్‌ను ముఖంపై సుమారు 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. అయితే, ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్యాక్ తీసేశాక కనీసం 4 నుంచి 5 గంటల వరకు ముఖానికి సబ్బు పెట్టకపోతే పూర్తి ప్రయోజనం ఉంటుంది.