Valentine's Day Gift: మనం ప్రేమగా ఇచ్చే కొన్ని బహుమతులే మన ప్రేమ సంబంధానికి ముగింపు పలుకుతాయి అని మీకు తెలుసా? అవును, కొన్ని రకాల గిఫ్ట్స్ ఇస్తే.. తొందరగా బ్రేకప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు, ప్రేమింకుల మనసులో కొత్త ఉత్సాహం మొదలౌతుంది. ఇక.. ఈ వాలంటైన్స్ డే రోజున ప్రేమికులు.. ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. కొందరికి అవి కేవలం బహుమతులు కావచ్చు. కానీ, కొందరికి ఇది ప్రేమకు చిహ్నం. అయితే.. మీ ప్రేమ కలకలం సంతోషంగా ఉండాలి అనుకుంటే…పొరపాటున కూడా కొన్ని రకాల బహుమతులు ఇవ్వకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
24
బ్రేకప్ కి కారణమయ్యే గిఫ్ట్స్
అవును, ప్రేమికుల రోజున (Valentine's Day) తప్పుడు గిఫ్టులు ఎంచుకుంటే సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉంది. కొన్ని వస్తువులు నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తే, మరికొన్ని విడిపోవడానికి సంకేతంగా భావిస్తారు. ఉదాహరణకు, గడియారం ఇస్తే ప్రేమ ఎక్కువ కాలం నిలవదని, అలాగే కళ్లజోడు ఇస్తే అపార్థాలు పెరుగుతాయని నమ్ముతారు. అలాంటి అశుభమైన బహుమతులు ఏంటో, వాటి వెనుక ఉన్న అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
34
Red Rose
ఎర్ర గులాబీలు ప్రేమకు చిహ్నం. కానీ నలుపు రంగు వస్తువులు లేదా నల్ల గులాబీలను గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదు. నలుపు రంగును దుఃఖానికి, వియోగానికి సంకేతంగా పరిగణిస్తారు. పర్సులు, బ్యాగులు, లెదర్ వస్తువులు ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు, బంధాల్లో గొడవలు వస్తాయని కొందరు నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, అద్దాలు బహుమతిగా ఇస్తే, వాటిలో ప్రతిబింబించే నెగెటివ్ ఎనర్జీ రెట్టింపు అవుతుంది. ఇది జంటల మధ్య నిరంతరం గొడవలకు దారితీస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరికైనా గడియారం ఇవ్వడమంటే మన సమయాన్ని వారికి బహుమతిగా ఇస్తున్నామని అర్థం. ఇది సంబంధం ముగిసిపోతోందని సూచిస్తుంది. అలాగే, మొక్కలను గిఫ్టుగా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా, కాక్టస్ లేదా ముళ్లు ఉన్న మొక్కలను అస్సలు ఇవ్వకూడదు. ముళ్లున్న మొక్కలు బంధంలో చేదును, గొడవలను పెంచుతాయి. కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులు బహుమతిగా ఇస్తే, అవి ప్రేమ బంధాన్ని తెంచేస్తాయని పురాణాలు చెబుతున్నాయి.