Clove water: లవంగాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లవంగాల నీరు కూడా మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. పడుకునే ముందు లవంగాల నీటిని తాగితే మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోండి.
లవంగాలను ఔషధాల గనిగా చెప్పుకోవాలి. ఇక దీనితో చేసే లవంగం నీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లవంగాల్లో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను, నిద్రను మెరుగుపరుస్తుంది. లవంగం నీరు రాత్రి పడుకోబోయే ముందు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర సమస్య ఉంట లవంగాల నీరు ఎంతో మంచిది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. పడుకునే ముందు తాగితే గ్యాస్, ఉబ్బరం, అజీర్తి తగ్గుతాయి. పొట్ట తేలికగా మారి హాయిగా నిద్రపడుతుంది.
24
గాఢమైన నిద్ర
ప్రశాంతంగా నిద్రపడితేనే ఎవరైనా చక్కగా పనిచేయగలరు. నిద్రపట్టకపోయినా, మధ్యలో మెలకువ వచ్చినా పడుకునే ముందు లవంగాల నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమిని పోగొడుతుంది. మీరు తరచుగా అనారోగ్యానికి గురైతే రోగనిరోధక శక్తిని పెంచడానికి లవంగాల నీరు వాడడం మంచిది. ఈ లవంగం నీరు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. నోటి సమస్యలున్న వారు లవంగాల నీరు తాగితే ఎంతో ఉత్తమం. ఇది బ్యాక్టీరియాను చంపి, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. లవంగంలోని యూజినాల్ వాపును తగ్గిస్తుంది. ఇది కీళ్ల నొప్పులు లేదా వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
34
లవంగాల నీటిని ఎలా తయారు చేయాలి?
ఒక గిన్నెలో నీళ్లు మరిగించండి.
లవంగాలు వేసి 5-7 నిమిషాలు తక్కువ మంటపై మరిగించండి.