ఎన్ని ప్రయత్నాలు చేసినా చుండ్రు పోవడం లేదా.. గుడ్డు, పెరుగు, కొబ్బరి నూనెతో ఇలా చేస్తే వెంటనే రిజల్ట్‌

Published : Jan 27, 2025, 09:46 AM IST

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో చుండ్రు ఒకటి. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. దీంతో చాలా మంది రకరకాల షాంపూలు, ఆయిల్స్‌ ఉపయోగిస్తుంటారు. అయితే ఇవేవి ఉపయోగించినా ఫలితం ఉండకపోతే ఓ నేచులర్‌ టిప్‌ను పాటిస్తే సమస్య పరార్‌ అవ్వాల్సిందే..   

PREV
14
ఎన్ని ప్రయత్నాలు చేసినా చుండ్రు పోవడం లేదా.. గుడ్డు, పెరుగు, కొబ్బరి నూనెతో ఇలా చేస్తే వెంటనే రిజల్ట్‌
dandruff control

తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగా చుండ్రు ఎక్కువుతోంది. దీంతో జుట్టు రాలుతుంది. చుండ్రు కారణంగా చికాకుగా ఉండడం, దురద, బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఎన్ని రకాల షాంపూలు వాడినా ప్రయత్నం లేకపోతే నేచురల్ టిప్‌ను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లోనే లభించే పెరుగు, కొబ్బరి నూనె, గుడ్డును కలిపి తయారు చేసుకునే హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకుంటే చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ ఈ హెయిర్‌ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

24
Egg for dandruff

ఎలా తయారు చేసుకోవాలంటే.. 

ఇందుకోసం ముందుగా ఒక గుడ్డును తీసుకోవాలి, ఆ తర్వాత సగం కప్పు పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనెను తీసుకోవాలి. అనంతరం ఇక గిన్నెలో గుడ్డును పగలకొట్టాలి. ఆ తర్వాత అందులో పెరుగును కలుపుకోవాలి. చివరిగా ఒక టీస్పూన్‌ కొబ్బరి నూనెను కలుపుకోవాలి. మిశ్రమాన్ని బాగా మిక్స్‌ చేసుకోవాలి. అంతే మీ హెయిర్‌ మాస్క్‌ రడీ అయినట్లే. 

34
dandruff

ఎలా అప్లై చేసుకోవాలి.? 

ఇందుకోసం ముందుగా జుట్టును నీటితో కొద్దిగా తడుపుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న హెయిర్‌ మాస్క్‌ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అనతంరం వేళ్లతో సాఫ్ట్‌గా మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 30 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వాసన పోవడానికి షాంపూను ఉపయోగించుకోవాలి. ఇలా వారం రోజులకు ఒకసారి చేసినా చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా దీంతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. 

44
Curd for Hair

ఎలా పనిచేస్తుంది.? 

పెరుగు, గుడ్డు, నూనెతో తయారు చేసిన ఈ మిశ్రం మాడు డ్రై కాకుండా చూడడంలో ఉపయోగపడుతుంది. తల హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది గుడ్డులోని ప్రొటీన్, బయోటిన్, విటమిన్ ఎ, డి, ఇ, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు మూలాలను బలంగా చేస్తాయి. బయోటిన్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది పెరుగులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును తొలగిస్తాయి. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఎల్లప్పుడూ సూచించదగ్గ విషయం. 

Read more Photos on
click me!

Recommended Stories