అది అమెరికానా? ఆంధ్రానా? తెలుగు వాళ్లు అన్ని లక్షల మంది ఉన్నారా?

Published : Jan 26, 2025, 04:16 PM IST

తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో తెలుగు భాష మాట్లాడేవారు అధిక సంఖ్యలో ఉండటం సహజం. కాని అమెరికాలో తెలుగు మాట్లాడే వారు ఎంతమంది ఉన్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది అమెరికానా? ఆంధ్రానా అంటారు.   

PREV
15
అది అమెరికానా? ఆంధ్రానా? తెలుగు వాళ్లు అన్ని లక్షల మంది ఉన్నారా?

భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. వీటికి అనుగుణంగానే దేశంలో వేల సంఖ్యలో భాషలు మాట్లాడేవారు ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. భారతదేశంలో సుమారు 19,500 భాషలు, మాండలికాలు ఉన్నాయి. దేశంలో 22 భాషలు అధికారికంగా గుర్తింపు పొందాయి. వీటిని భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో పొందుపరిచారు.

25

ప్రధానంగా రాష్ట్రాల వారీగా ఎక్కువగా మాట్లాడే భాషల గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు ప్రధాన భాషగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉంటారు. ఇవే కాకుండా ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్లు వలస వెళ్లి సెటిల్ అయ్యారు. 
 

35

ఇక విదేశాల్లో తెలుగు మాట్లాడే వారి గురించి చెప్పాలంటే భారత దేశంలో కాకుండా అత్యధికంగా తెలుగు మాట్లాడేవారు ఉన్న మరో దేశం అమెరికా. ఇక్కడ సుమారు 12,30,000 మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారట. అమెరికా తర్వాత తెలుగు ఎక్కువగా మాట్లాడేవారు సౌదీ అరేబియా, మయన్నార్, మలేషియా, ఆస్ట్రేలియా, కెనడా టాప్ లిస్టులో ఉన్నాయి. ఇవే కాకుండా ప్రపంచలోని అనేక దేశాల్లో తెలుగు వాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ జీవిస్తుండటం విశేషం. 

45

దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడతారు. ఆ తర్వాత బెంగాలీ, తర్వాత మరాఠీ భాష దేశంలో ఎక్కువ మంది మాట్లాడతారు. ఈ భాషల తర్వాత భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. ఇది 4వ స్థానం లో ఉంది. 2008 అక్టోబర్ 31న తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించారు. విద్య కోసం, ఉద్యోగం, వ్యాపారాలు చేసుకోవడానికి తెలుగు వారు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. 

55

తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న టాప్ దేశాలు

కెనడాలో సుమారు 54,685 మంది తెలుగు మాట్లాడేవారు  ఉన్నారు.
ఆస్ట్రేలియాలో 59,400 మంది, 
మలేషియాలో 1,26,000 మంది, 
మయన్నార్ 1,38,000 మంది,
సౌదీ అరేబియాలో 3,83,000 మంది,
అమెరికాలో 12,30,000 మంది తెలుగు వాళ్లు నివసిస్తున్నారు. 
ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కలిసి మొత్తం 8,11,27,740 మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద సుమారు 9 కోట్ల మంది తెలుగు వాళ్లు ఉన్నారు.

click me!

Recommended Stories