Studying in the USA అమెరికాలో చదువుతారా? ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!

అమెరికాలో భారతీయులకు పరిస్థితులు ఇప్పుడు అంత ఆశాజనకంగా లేవు. అక్రమంగా ఉంటున్నవారిని, పత్రాలు సరిగా లేనివారిని బలవంతంగా వెనక్కి పంపుతున్నారు. అయినా అమెరికా అంటే ఎప్పటికీ మనకు కలల దేశమే. అక్కడ చదువుకోవడం చాలామంది భారతీయ విద్యార్థుల స్వప్నం. కానీ యూఎస్ లో అడ్మిషన్ పొందడం అంత తేలికేం కాదు.  అక్కడికెళ్లాలంటే ఆర్థిక అర్హతను కూడా నిరూపించుకోవాలి. అందుకు ఏ పత్రాలు అవసరమో, వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

USA Study Abroad Essential Financial Documents
1. బ్యాంక్ స్టేట్‌మెంట్

మీరు అక్కడ చదువుకోవడానికి, అక్కడి ఖర్చులు తట్టుకొని జీవించగలరు అని నిరూపించుకోవాలి ముందు. దానికోసం మన బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. తగినంత లిక్విడ్ ఫండ్స్ కలిగి ఉన్నారని బ్యాంక్ స్టేట్‌మెంట్ చూపిస్తుంది.

2. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)

కొన్ని యూనివర్సిటీలు FD లను అంగీకరిస్తాయి, అవి వెంటనే రిడీమ్ చేసుకునే విధంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి పనికొచ్చేలా, ఇంకొకరిపై ఆధారపడకుండా ఉండటానికి వీటిని అడుగుతుంటారు.


3. స్పాన్సర్ అఫిడవిట్

మీ చదువును ఎవరైనా స్పాన్సర్ చేస్తే, ఈ డాక్యుమెంట్ తప్పనిసరి. స్పాన్సర్ విద్య, జీవన ఖర్చులను భరిస్తారని అందులో స్పష్టంగా రాసి ఉండాలి. అవసరమైతే వాళ్ల ఆర్థిక స్థాయి, హోదా వివరాలు కూడా అందించాలి. అమెరికాలో ఉండే స్పాన్సర్లు I-134 ఫారం నింపాలి.

4. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) & శాలరీ స్లిప్

ఈ పత్రం స్పాన్సర్ లేదా విద్యార్థి యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని చూపుతుంది. గత 2-3 సంవత్సరాల ITR, ఇటీవలి శాలరీ స్లిప్‌లు ఉపయోగపడతాయి. ఈ డాక్యుమెంట్ స్పాన్సర్ లేదా విద్యార్థి ఆర్థికంగా ఎంత స్థిరంగా ఉన్నారో చూపిస్తుంది. గత 2-3 సంవత్సరాల ITRలు, శాలరీ స్లిప్‌లు ఇవ్వడం మంచిది.

5. స్కాలర్‌షిప్ లెటర్

విద్యార్థికి స్కాలర్‌షిప్ లభిస్తే, ఆ సంస్థ నుండి అధికారిక లేఖ అవసరం. అది దేశీయ, విదేశీ.. ఏదైనా ఫర్వాలేదు. ఆ వివరాలతో కూడిన కాపీ తప్పకుండా చూపించాలి. విద్యార్థికి స్కాలర్‌షిప్ వస్తే, ఆ సంస్థ నుంచి అధికారిక లెటర్ కావాలి. అందులో ఎంత డబ్బు ఇస్తారు, ఎప్పటి వరకు ఇస్తారు అనే వివరాలు ఉండాలి.

6. ఎడ్యుకేషన్ లోన్ అంగీకార పత్రం

ఒకవేళ విద్యారుణం తీసుకొని అమెరికాలో చదువుకోవడానికి వెళ్తే.. ఆ రుణం వివరాలు తప్పకుండా సమర్పించాలి.  బ్యాంకు నుండి అంగీకార పత్రం అవసరం. ఇందులో రుణ మొత్తం, పంపిణీ విధానం ఉండాలి.

7. ఈ డాక్యుమెంట్లు చెల్లవు..

ఇల్లు, స్థలం, జీవిత బీమా పాలసీ, షేర్ మార్కెట్ పెట్టుబడులు.. ఇవన్నీ డబ్బులుగా మార్చలేని ఆస్తులు. వీటిని సాధారణంగా పరిగణించరు.

vuukle one pixel image
click me!