యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ.. బ్యూటీ సీక్రేట్ ఏంటంటే....

First Published Oct 26, 2021, 1:21 PM IST

హన్సిక అందాన్ని పదిలంగా కాపాడుకోవడానికి home made beauty hackhs ను ఫాలో అవుతుంది. అది కూడా రెగ్యులర్ గా ప్రయత్నిస్తుందట. 

అందాల ముద్దుగుమ్మ హన్సిక. దోర మగ్గిన జాంపండులా నిగనిగలాడి పోతుంది. ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆమె స్కిన్ టెక్చర్. 

హన్సిక మోత్వానీ.. ఈ పేరు వినని కుర్రకారు ఉండరు. డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి హీరోయిన్ గా పరిచయమైన యాపిల్ బ్యూటీ హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో జతకట్టింది. హన్సికకు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారంటే.. తమిళనాడులో అయితే  ఏకంగా గుడి కట్టేశారు. అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. 

హన్సిక ఎంత ఫెయిర్ గా ఉంటుందో.. అంత సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉంటుందట. అందుకే తన చర్మానికి ఎంతో జాగ్రత్త తీసుకుంటానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. పాల నురగలాంటి తన అందాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుందట హన్సిక. 

హన్సిక అందాన్ని పదిలంగా కాపాడుకోవడానికి home made beauty hackhs ను ఫాలో అవుతుంది. అది కూడా రెగ్యులర్ గా ప్రయత్నిస్తుందట. 

ఆమె తెల్లటి మేనిఛాయకు, సెన్సిటివ్ స్కిన్ కు సూర్యకిరణాలు పెద్ద ఇబ్బందిగా మారతాయి. అందుకే ఎండలోకి వెళ్లే ముందు తప్పని సరిగా SPF cream వాడుతుందట. అది లేకుండా అడుగు బయటపెట్టదట. 

దీనికి తోడు sunburn లేకుండా ఉండడానికి ప్రత్యేకమైన సన్ బర్న్ క్రీంను ఉపయోగిస్తుంది. ఇది ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది. దీనికోసం ఓ పెద్ద దోసకాయ, ఓ కప్పు పెరుగు కావాలి.

ముందుగా కీరాను సన్నగా తురుముకోవాలి. దీన్ని కప్పు పెరుగలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత దీన్ని చర్మానికి రాసుకోవాలి. అరగంట పాటు వదిలేసి.. ఆ తరువాత నీటితో కడిగేసుకోవాలి. 

దీనికి తోడు hansika ఎప్పుడూ తనను తాను హైడ్రేట్ కాకుండా చూసుకుంటుంది. అందుకోసం ఎక్కువ మొత్తంలో నీరు తాగుతుంది. 

వీటన్నింటితో పాటు వర్కవుట్స్ చేయడం ఎప్పుడూ వదిలేయదట. క్రమం తప్పని వ్యాయామం వల్లే natural glow వస్తుందని నమ్ముతుంది. 

మేకప్ అవసరం లేని అందం హన్సికది. అందుకే మేకప్ లేకుండా ఉండడానికే ఇష్టపడుతుందట. మేకప్ వల్ల తన చర్మరంధ్రాలు మూసుకుపోయి చర్మానికి గాలి ఆడకుండా ఉండాలంటే..మేకప్ ను అవాయిడ్ చేయాలని చూస్తుందట. 

అందం కోసం.. ముఖానికి ఇవి రాస్తున్నారా..? చాలా ప్రమాదం..!

click me!