Roti: జొన్న రొట్టె, సజ్జ రొట్టె... బరువు తగ్గాలంటే ఏది తినాలి.?

Published : Nov 19, 2026, 12:42 PM IST

Roti: చాలా మంది బరువు తగ్గడానికి అన్నం తినడం మానేసి, రోటీలు తింటూ ఉంటారు. అయితే... నార్మల్ గోధుమ పిండి రోటీలకు బదులు జొన్న రొట్టె, సజ్జ రొట్టె తినడం బెస్ట్. మరి, ఈ రెండింటిలో ఏది బెస్ట్..?

PREV
13
ఏ రొట్టె తినాలి?

‘రోజూ రాత్రి రెండు రొట్టెలు తింటే చాలు, ఇట్టే బరువు తగ్గిపోతారు’ డైటీషియన్ల దగ్గర తరచుగా వినిపించే మాట ఇది. కానీ ఆ ప్లేట్‌లో ఉండాల్సింది కమ్మని సజ్జ రొట్టెనా లేక మృదువైన జొన్న రొట్టెనా? రెండూ పోషకాల గనులే అయినా, వెయిట్ లాస్ విషయంలో రెండింటి పనితీరు వేరుగా ఉంటుంది. ఏది తింటే ఈజీగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం...

23
సజ్జ రొట్టె ఆరోగ్య ప్రయోజనాలు...

సజ్జలు పోషకాల గని. సజ్జల్లోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి, బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

ఎక్కువ సేపు ఆకలి వేయదు: సజ్జ రొట్టెలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల మధ్యమధ్యలో చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గి బరువు అదుపులో ఉంటుంది.

బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది: ఇందులోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం జరగదు. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, బరువు తగ్గడానికి ఇది ఎంతో అవసరం.

ముఖ్యమైన ఖనిజాల నిలయం: సజ్జల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి, జీవక్రియ వేగవంతం కావడానికి తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు: సజ్జల్లోని మెగ్నీషియం రక్తపోటును (BP) నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

33
జొన్న రొట్టె ఆరోగ్య ప్రయోజనాలు..

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారికి జొన్న రొట్టె ఎప్పుడూ ఫేవరెట్. గ్లూటెన్ పడని వారికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారికి జొన్నలు అద్భుతమైన ఆహారం.

తేలికగా జీర్ణమవుతుంది: జొన్న రొట్టె సహజంగానే గ్లూటెన్-ఫ్రీ. ఇది కడుపుకు చాలా తేలికగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటే పోషకాలు శరీరానికి బాగా అందుతాయి, తద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలం: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, జొన్నల్లో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, జీవక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా శరీరం క్యాలరీలను సమర్థవంతంగా ఖర్చు చేస్తుంది.

మంచి ప్రోటీన్ : కండరాల బలానికి ప్రోటీన్ చాలా అవసరం. జొన్న రొట్టెలో మొక్కల ఆధారిత ప్రోటీన్ మంచి మొత్తంలో లభిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి, అతిగా తినడం నివారించవచ్చు.

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: జొన్నల్లో ఉండే కరిగే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది కొవ్వు కరగడానికి , బరువును స్థిరంగా ఉంచుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ఏది బెటర్? 

నిజానికి సజ్జ రొట్టె, జొన్న రొట్టె రెండూ అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి రెండూ బాగానే పని చేస్తాయి. అయితే, రెండింటినీ పోల్చి చూస్తే ఒక చిన్న తేడా ఉంది.

సజ్జ రొట్టె: ఇందులో ప్రోటీన్, ఖనిజాలు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే విషయంలో సజ్జ రొట్టెకు కొంచెం పైచేయి ఉంటుందని చెప్పవచ్చు.

జొన్న రొట్టె: ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి, గ్యాస్ లేదా అజీర్తి సమస్యలు ఉన్నవారికి జొన్న రొట్టె బెస్ట్ ఆప్షన్.

అయితే, నిజంగా బరువు తగ్గాలి అనుకుంటే.. ఏదో ఒకటే తినకుండా రెండు రోజులకు ఒకసారి మార్చి మార్చి రెండింటినీ తీసుకుంటే.. ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories